get 5.1 Dolby Soundbar under 5k budget today on flipkart
కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఒక గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఏమిటంటే, కేవలం 5000 రూపాయల బడ్జెట్ ధరలోనే 5.1 Dolby Soundbar మీ సొంతం చేసుకోవచ్చు. అంటే, ఈ ఆఫర్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సౌండ్ బార్ మీకు లభిస్తుంది. మరి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరి ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.
ఈ సౌండ్ బార్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఇక ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే, ఇది GOVO లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1 డాల్బీ ఆడియో సౌండ్ మరియు ఇది GO SURROUND 980 మోడల్ పేరుతో ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,849 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది గొప్ప డీల్ గా నిలుస్తుంది.
Also Read: boAt Nirvana Eutopia 2 ANC హెడ్ ఫోన్ ను 80 గంటల లాంగ్ ప్లే బ్యాక్ తో లాంచ్ చేసింది.!
ఈ గోవో సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో మజుడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే ప్రత్యేకమైన సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 525W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ను ఈ సౌండ్ బార్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫిజికల్ వాల్యూమ్ అండ్ మీడియా కంట్రోల్ బటన్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో వస్తుంది. ఇది మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో మంచి ఉన్నతమైన సౌండ్ కోసం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) కూడా ఉంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో మంచి డాల్బీ సౌండ్ కోరుకునే వారికి తగిన సౌండ్ బార్ డీల్ అవుతుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేరింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.