flipkart today offers top rated 5.1 Dolby audio sound at lowest price ever
భారత మార్కెట్లో ఇప్పుడు సౌండ్ బార్ లో మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. సౌండ్ బార్ లు ఎంత చీప్ గా లభిస్తున్నాయంటే, కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే 5.1 Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు. అయితే, ఈరోజు మరింత గొప్ప డీల్ ఒకటి అందుబాటులో ఉంది. అదేమిటంటే, టాప్ రేటెడ్ 5.1 Dolby సౌండ్ బార్ 6 వేల బడ్జెట్ ప్రైస్ లో సేల్ అవుతోంది. బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఒక లుక్కేయండి.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ గొప్ప సౌండ్ బార్ ఆఫర్ మీకు లభిస్తుంది. ఇక సౌండ్ బార్ ఆఫర్ విషయానికి వస్తే, E Gate ఇండియాలో కొత్తగా విడుదల చేసిన 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Phantom 630DW రోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ ని 77% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ముఖ్యంగా, 540W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ మరియు డాల్బీ ఆడియో వంటి ఫీచర్స్ తో లభించే అతి చవక రేటు సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది.
Also Read: మీ Smart TV మిమ్మల్ని ట్రాక్ చేస్తుందని మీకు తెలుసా .. ఎలా ఆపాలంటే.!
ఇంట్లోనే థియేటర్ ఫీల్ కావాలనుకునే మూవీ లవర్స్ కోసం ఈ సౌండ్ బార్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. OTT లో సినిమాలు తో పాటు గేమింగ్ కోసం కూడా చక్కగా సరిపోతుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ లో 5.1డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఈ ఫీచర్ తో సినిమా చూస్తున్నప్పుడు డైలాగ్స్ మధ్య నుంచి, యాక్షన్ ఎఫెక్ట్స్ సైడ్ స్పీకర్ నుంచి వస్తాయి.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ నుంచి వచ్చే భారీ బాస్ సౌండ్ నిజమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా, యాక్షన్ సినిమాలు, IPL మ్యాచ్ లు మరియు Playstation గేమింగ్ లో సరౌండ్ ఎఫెక్ట్ సౌండ్ ను మీరు బాగా ఫీల్ అవుతారు. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్ 2 రియర్ స్పీకర్ తో పాటు సబ్ ఉఫర్ కూడా ఉంటాయి.
ఈ సౌండ్ బార్ లో HDMI eARC, ఆప్టికల్ ఇన్, AUX, USB మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ కనెక్టివిటీ సపోర్ట్ తో స్మార్ట్ టీవీ, ప్రొజెక్టర్, ల్యాప్ టాప్, మొబైల్, గేమింగ్ కన్సోల్ వంటి డివైజెస్ తో ఈజీగా గా కనెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా, HDMI ARC వల్ల డాల్బీ ఆడియో క్వాలిటీ లాస్ లేకుండా ప్లే బ్యాక్ అవుతుంది.