Sony మరియు Panasonic Dolby సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి.. ఎక్కడంటే.!
ఈరోజు Sony మరియు Panasonic Dolby సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి
బ్రాండెడ్ సౌండ్ బార్ లను మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం
ఈ రెండు సౌండ్ బార్స్ కూడా గొప్ప ఫీచర్స్ మరియు డిజైన్ తో అమితంగా ఆకట్టుకుంటాయి
ఈరోజు Sony మరియు Panasonic Dolby సౌండ్ బార్స్ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ సౌండ్ బార్స్ ఎక్కడ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి, అని వెంటనే అడగాలని ఉందా? కంగారు పడకండి అక్కడికే వస్తున్నాను. ఫ్లిప్ కార్ట్ 2025 సంవత్సరం చివరి సేల్ గా ప్రకటించిన ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్స్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ అందించిన గొప్ప డిస్కౌంట్ తో సోనీ మరియు పానాసోనిక్ సౌండ్ బార్ లను మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ మనకు అందించింది.
SurveySony మరియు Panasonic Dolby సౌండ్ బార్ : ఆఫర్
సోనీ యొక్క 3.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ HT-G700 మరియు పానాసోనిక్ యొక్క 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ బార్ SC-HTS600GWK ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా గొప్ప ఫీచర్స్ మరియు డిజైన్ తో అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ రెండు సౌండ్ బార్ ప్రైస్, ఆఫర్ మరియు ఫీచర్స్ వివరంగా చూద్దామా.

SONY HT-G700 సౌండ్ బార్
ఇది సోనీ అందించిన లేటెస్ట్ 3.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 58% భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను బాబ్ కార్డు EMI, HDFC మరియు HSBC బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే మీకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 18,499 ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ తో ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ కలిగిన సెటప్, ఫీచర్స్ మరియు సౌండ్ అవుట్ పుట్ తో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది.
Also Read: 55 ఇంచ్ QLED Smart Tv కొనాలనుకునే వారికి రియల్ డీల్ అందించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!
Panasonic Dolby సౌండ్ బార్
ఈ పానాసోనిక్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 44% డిస్కౌంట్ తో రూ. 19,490 ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై HDFC, BOBCARD EMI మరియు HSBC బ్యాంక్ కార్డ్ అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,990 రూపాయల ఆఫర్ ధరకే మీకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ మంచి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, వైర్లెస్ సరౌండ్ స్పీకర్ మరియు వైర్డ్ సబ్ ఉఫర్ తో కంప్లీట్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ పానాసోనిక్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ రెండు బ్రాండెడ్ సౌండ్ బార్స్ కూడా మంచి రేటింగ్ మరియు గొప్ప పాజిటివ్ రివ్యూలు కూడా కలిగి ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile