ఈరోజు లభిస్తున్న 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మళ్ళీ దొరకదేమో.!

HIGHLIGHTS

ఈరోజు లభిస్తున్న 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మళ్ళీ దొరకదేమో అనిపించేంత గొప్పగా ఉంది

ఫేమస్ బ్రాండ్ పవర్ ఫుల్ 700W డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ చవక రేటుకే లభిస్తోంది

ఈ సౌండ్ బార్ సూపర్ సరౌండ్ సౌండ్ అందించే కంప్లీట్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది

ఈరోజు లభిస్తున్న 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మళ్ళీ దొరకదేమో.!

ఈరోజు లభిస్తున్న 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మళ్ళీ దొరకదేమో అనిపించేంత గొప్పగా ఉంది. గత సంవత్సరం ఇండియాలో విడుదలైన ఫేమస్ బ్రాండ్ పవర్ ఫుల్ 700W డాల్బీ అట్మోస్ సౌండ్ బార్, ఈ రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం సాధారణ డాల్బీ ఆడియో సౌండ్ బార్ రేటుకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ సూపర్ సరౌండ్ సౌండ్ అందించే కంప్లీట్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఫీచర్స్ ఏమిటో క్లియర్ గా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : డీల్

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన MOTOROLA గత సంవత్సరం అందించిన సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అదేమిటంటే, మోటోరోలా యొక్క AmphisoundX Vibe సిరీస్ నుంచి అందించిన 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్. ఈరోజు ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ 77% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 16,999 రూపాయల అతి చవక ధరలో సేల్ చేస్తోంది.

Motorola 5.2.4 Dolby Atmos deal on flipkart

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మీద రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందచేసింది. ఈ ఆఫర్స్ తో ఈ మోటోరోలా సౌండ్ బార్ కేవలం రూ. 15,999 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ గొప్ప డీల్ గా నిలుస్తుంది.

Also Read: Redmi A7 Series నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న షియోమీ.!

మోటోరోలా 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ మోటోరోలా సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, 4 ఛానల్ సౌండ్ మరియు 4 ఛానల్ రియర్ శాటిలైట్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఈ మొత్తం సరౌండ్ సెటప్ కి జబర్దస్త్ థండర్ బాస్ సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ కూడా జతగా ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 700W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, మరింత ఉన్నతమైన సౌండ్ కోసం మూవీ, మ్యూజిక్, న్యూస్, 3D మరియు స్పోర్ట్స్ మోడ్స్ వంటి ప్రీ సెట్ ఈక్వలైజర్ సెటప్ కూడా ఉంటుంది. ఈ ఇది టీవీ మరియు సౌండ్ కి ఉపయోగించే సింగల్ రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఇందులో HDMI eArc, ఆప్టికల్, Coaxial, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo