flipkart grwm grwm sale offers huge deals on Sony Dolby Atmos soundbar
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ రీసెంట్ సౌండ్ బార్ ఒకటి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో లభిస్తోంది. . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, Sony Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో కేవలం 17 వేల ధరలో లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఎందుకు అందుబాటులో ఉంటుంది మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ అండ్ ఆఫర్స్ వంటి కంప్లీట్ వివరాలు తెలుసుకోండి.
డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో సోనీ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన సౌండ్ బార్ HT-G700 పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన GRWM GRWM సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. అయితే, ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇక డీల్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 58% భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 సేల్ ఆఫర్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. అలాగే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను SBI, HDFC, ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 17,999 అతి చవక ధరలో లభిస్తుంది.
Also Read: Infinix Smart 20: బిగ్ డిస్ప్లే మరియు స్లిమ్ బాడీ తో లాంచ్ అవుతోంది.!
సోనీ HT-G700 అనేది సోనీ అందించిన ప్రీమియం 3.1 ఛానల్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ 400W టోటల్ అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే సరౌండ్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో 3D సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది.దీనితో మీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్ మరియు మ్యూజిక్ అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది.
ఇందులో 3.1 ఛానల్ సౌండ్ బార్ తో పాటు వైర్ లెస్ సబ్ వూఫర్ వస్తుంది. ప్రత్యేక సెంటర్ స్పీకర్ ఉండటం వల్ల డైలాగ్ లు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఇది కాకుండా సోనీ వర్టికల్ సరౌండ్ ఇంజిన్ మరియు S-Force PRO ఫ్రంట్ సరౌండ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ తో వర్చువల్ సరౌండ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో ఉన్న ఇమ్మర్సివ్ AE (Audio Enhancer) ఫీచర్ సాధారణ ఆడియోను కూడా మరింత విస్తృతమైన సరౌండ్ సౌండ్ గా మార్చుతుంది.
ఈ సౌండ్ బార్ లో HDMI eARC / ARC, ఆప్టికల్ ఆడియో మరియు USB Type-A పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 4K HDR, Dolby Vision, HLG మరియు HDCP 2.2 సపోర్ట్ ఉండటం వల్ల అత్యుత్తమ వీడియో నాణ్యత కూడా ఆస్వాదించవచ్చు.