flipkart announced big deals and price cut on samsung Dolby Atmos soundbar
Price Cut : ఇండియాలో శాంసంగ్ విడుదల చేసిన Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం 13 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది సౌండ్ బార్ మాదిరి ఫీచర్స్ కలిగి ఉన్నా కూడా దీన్ని ఫ్రేమ్ స్మార్ట్ స్పీకర్ గా కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ స్పీకర్ ఫోటో ఫ్రేమ్ మాదిరి డిజైన్ తో ఉంటుంది. అయితే, ఇది సౌండ్ బార్ మాదిరి స్పీకర్ సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇది శాంసంగ్ అందించిన స్మార్ట్ ఫ్రేమ్ స్పీకర్ మరియు HW-LS60D/XL మోడల్ నెంబర్ తో ఉంటుంది. ఈ స్పీకర్ కమ్ సౌండ్ బార్ రూ. 23,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో గత సంవత్సరం లాంచ్ అయ్యింది. ఈ స్పీకర్ కమ్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం రూ. 10,000 రూపాయల భారీ ప్రైస్ కట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో ఈ ఫ్రేమ్ స్పీకర్ కేవలం రూ. 13,999 డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది.
ఈ ఫ్రేమ్ స్పీకర్ పై Canara బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ స్పీకర్ కేవలం రూ. 12,749 రూపాయల అతి చవక ధరలో మీకు అందుతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే స్మార్ట్ స్పీకర్ లేదా సౌండ్ బార్ కంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్ గా అవుతుంది. ఈ స్పీకర్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.8 హై స్టార్ రేటింగ్ అందుకుంది.
Also Read: ఇండియాలో First Hydrogen Train ప్రారంభం: గ్రీన్ రైల్ రవాణాలో కొత్త అధ్యాయం లిఖించింది.!
ఈ స్మార్ట్ స్పీకర్ కమ్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది టీవీ పై ఒక ఫోటో ఫ్రేమ్ మాదిరిగా అందంగా ఉండేలా డిజైన్ చేయబడింది. అయితే ఇది బిల్ట్ ఇన్ ఉఫర్ మరియు స్పీకర్ తో టోటల్ 120W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ స్పీకర్ డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు Q-Symphony సౌండ్ టెక్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్పీకర్ లో , Wide Sweet Spot, స్పేస్ ఫిట్ సౌండ్ మరియు అడాప్టివ్ సౌండ్ వంటి మరిన్ని ఇతర సౌండ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇందులో Wi-Fi సపోర్ట్, బ్లూటూత్ 5.2, ఆప్టికల్, Spotify కనెక్ట్, క్రోమ్ క్యాస్ట్, ఆపిల్ ఎయిర్ ప్లే మరియు స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు శాంసంగ్ యొక్క Bixby వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ Alexa మరియు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.