ఇండియాలో First Hydrogen Train ప్రారంభం: గ్రీన్ రైల్ రవాణాలో కొత్త అధ్యాయం లిఖించింది.!

HIGHLIGHTS

భారతీయ రైల్వే కొత్త టెక్నాలజీతో దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది

దేశంలో First Hydrogen Train తో గ్రీన్ రైల్ రవాణాలో కొత్త అధ్యాయం లిఖించింది

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది

ఇండియాలో First Hydrogen Train ప్రారంభం: గ్రీన్ రైల్ రవాణాలో కొత్త అధ్యాయం లిఖించింది.!

భారతీయ రైల్వే కొత్త టెక్నాలజీతో దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. అదేమిటంటే, పర్యావరణహిత రవాణా వ్యవస్థ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలును ప్రారంభించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా ముందడుగు వేసింది. ఈ రైలు డీజిల్‌ కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి స్వయంగా విద్యుత్‌ ను ఉత్పత్తి చేసుకుంటూ ప్రయాణిస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇండియాలో First Hydrogen Train ఎక్కడ ప్రారంభం అయ్యింది?

భారత తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ రైల్వే మార్గంలో తన తోలి సర్వీస్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్ స్టోరేజ్, రీ ఫ్యూయలింగ్ మరియు భద్రత కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.

హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

ఈ రైలులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ని ఉపయోగిస్తారు. అంటే, హైడ్రోజన్ మరియు గాలిలోని ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా ఇందులో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ తో రైలు మోటార్లు పనిచేస్తాయి మరియు దీనితో రైలు ముందుకు సాగుతుంది. ఈ ప్రక్రియలో హానికరమైన కార్బన్ ఉద్గారాలు విడుదల కాకుండా, కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందుకే దీనిని పర్యావరణహిత రవాణా టెక్నాలజీ గా పరిగణిస్తున్నారు.

First Hydrogen Train

అంటే, ఈ రైలు గురించి సింపుల్ చెప్పాలంటే, పర్యావరణ వ్యవస్థ కి ఎటువంటి హాని కలిగించకుండా, మరింత గొప్ప రవాణా వ్యవస్థ నిర్మించడం సాధ్యం చేస్తుంది. అందుకే, ఈ రైలు గురించి గ్రీన్ రైల్ రవాణాలో కొత్త అధ్యాయం అని చెబున్నారు.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ లో ఎక్కువ భాగం విద్యుదీకరించబడినా, కొన్ని మార్గాల్లో ఇంకా డీజిల్‌ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు సమర్థవంతమైన మరియు గొప్ప ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఇది గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని పెంచడంతో పాటు, భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు కూడా దోహదపడుతుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు తో హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న కొద్ది శాతం దేశాల సరసన భారత్ కూడా సగర్వంగా నిలుచుంది.

Also Read: 5.1 Dolby Soundbar Deals: కేవలం 6 వేల లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!

ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటి?

ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత పవర్ సిస్టం మరియు పూర్తిగా దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు. ప్రయాణ సమయంలో ఎటువంటి కార్బన్ ఉద్గారాలు విడుదల చేయకపోవడం ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకత. హానికరమైన పొగకు బదులుగా నీటి ఆవిరి మాత్రమే ఈ ట్రైన్ విడుదల చేస్తుంది. ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ ట్రైన్ అధునాతన భద్రతా వ్యవస్థలు మరియు ప్రత్యేకమైన హైడ్రోజన్ లీకేజీ గుర్తింపు సెన్సార్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile