Dolby Audio vs Dolby Atmos Soundbar: మీకు ఏది బెస్ట్ మరియు మేజర్ తేడాలు ఏమిటి.!

HIGHLIGHTS

ఆడియో మరియు వీడియో సెగ్మెంట్లో సరికొత్త పరికరాలు అందరికీ అందుబాటులో వచ్చాయి

ఇప్పుడు ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి సౌండ్ ను ఆస్వాదించే అవకాశం సౌండ్ బార్ లతో లభించింది

Dolby Audio vs Dolby Atmos Soundbar మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది

Dolby Audio vs Dolby Atmos Soundbar: మీకు ఏది బెస్ట్ మరియు మేజర్ తేడాలు ఏమిటి.!

Dolby Audio vs Dolby Atmos Soundbar: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీతో ఆడియో మరియు వీడియో సెగ్మెంట్లో సరికొత్త పరికరాలు అందరికీ అందుబాటులో వచ్చాయి. ఒకప్పుడు గొప్ప సౌండ్ ఆస్వాదించాలంటే కేవలం సినిమా థియేటర్ మాత్రమే ఏకైక మార్గంగా ఉండేది. అయితే, ఇప్పుడు ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి సౌండ్ ను ఆస్వాదించే అవకాశం సౌండ్ బార్ లతో లభించింది. అయితే, మార్కెట్లో అనేక విధాలైన సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సౌండ్ బార్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికంగా లభించే సౌండ్ బార్ లు డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో ఉంటాయి. ఈ రెండు సౌండ్ టెక్నాలజీలలో మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మరియు మరియు వీటి మధ్య మేజర్ తేడాలు ఈ రోజు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Audio vs Dolby Atmos Soundbar: తేడా ఏమిటి?

డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీలలో ఉన్న అతిపెద్ద మేజర్ వ్యత్యాసం ఏమిటంటే, డాల్బీ ఆడియో కేవలం 2D సరౌండ్ తో మాత్రమే వస్తుంది. అయితే, డాల్బీ అట్మోస్ మాత్రం 3D సరౌండ్ సౌండ్ తో వస్తుంది.

ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, డాల్బీ ఆడియో సౌండ్ బార్ ఎడమ, కుడి మరియు ముందు మాత్రమే సౌండ్ సెపరేషన్ అందిస్తే, డాల్బీ అట్మోస్ మాత్రం రూమ్ లో ఉన్న అన్ని వైపులతో పాటు సీలింగ్ పై నుంచి కూడా సౌండ్ అందిస్తుంది. ఇది మరింత క్లియర్ గా తెలుసుకోవాలంటే మరింత వీటి గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి.

డాల్బీ ఆడియో టెక్

డాల్బీ ఆడియో అనేది సాధారణ స్టీరియో లేదా మల్టీ ఛానల్ ఆడియో ఫార్మాట్ ను మరింత మెరుగైన నాణ్యతతో వినిపించే టెక్నాలజీ. ఇందులో డైలాగ్‌ లు స్పష్టంగా వినిపించడం, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బ్యాలెన్స్‌ గా ఉండడంతో పాటు సినిమాలు మరియు టీవీ షోలలో మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందించడం దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా, ఇది బడ్జెట్ ధరలో లభించే ఆడియో టెక్ అని చెప్పవచ్చు.

Dolby Audio vs Dolby Atmos Soundbar

డాల్బీ అట్మోస్ టెక్

ఇది డాల్బీ అందించిన అత్యాధునిక 3D ఆడియో టెక్నాలజీ. ఇందులో సౌండ్ ఎడమ, కుడి, వెనుక వైపు నుంచి మాత్రమే కాకుండా సీలింగ్ పై భాగం నుంచి కూడా వస్తున్నట్టు అనిపించడం దీని ప్రత్యేకత. అందుకే, ఈ సౌండ్ సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ తో మీరు సినిమా హాల్‌ లో కూర్చున్నట్లుగా మరింత సహజమైన అనుభూతి పొందవచ్చు. ఇందులో వర్షం సీన్స్, హెలికాప్టర్ మరియు యుద్ధ సన్నివేశాలు వంటి వాటిని మీరు రియల్ గా ఫీల్ అవుతారు.

Also Read: AP EAPCET Counselling 2026 ప్రారంభం .. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ మరియు కంప్లీట్ ఇన్ఫో తెలుసుకోండి.!

మీకు ఏది బెస్ట్?

మీరు టైట్ బడ్జెట్ తో ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే డాల్బీ ఆడియో సౌండ్ బార్ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, ప్రస్తుతం మార్కెట్లో డాల్బీ ఆడియో సౌండ్ బార్ లు కేవలం రూ. 3,999 రూపాయల ప్రారంభ ధర నుండి లభిస్తున్నాయి. అయితే, ఇది రోజువారీ టీవీ వినియోగం మరియు పాటలు వినడానికి గొప్పగా ఉంటుంది.

Dolby Audio vs Dolby Atmos Soundbar

ఇక డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సౌండ్ బార్ విషయానికి వస్తే, బడ్జెట్ తో పని లేకుండా సినిమా థియేటర్ వంటి సౌండ్ కోరుకుంటే, మీరు నిరభ్యరంతగా ఈ సౌండ్ బార్ ఎంచుకోవచ్చు. ఇది మీ ఇంటిని రియల్ సినిమా థియేటర్ గా మారుస్తుంది. అయితే, ఇందులో ఫ్రంట్, రియర్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఉన్న సౌండ్ బార్ ను ఎంచుకోవడం ఉత్తమం.

ఈ రెండు బార్ ఎంపిక గురించి సింపుల్ గా చెప్పాలంటే, డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ రెండూ మంచి సౌండ్ టెక్నాలజీలే అవుతాయి. అయితే, మీ అవసరం, మీ బడ్జెట్ మరియు మీరు చూసే కంటెంట్ ఆధారంగా ఎంపిక మారుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile