AP EAPCET Counselling 2026 ప్రారంభం .. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ మరియు కంప్లీట్ ఇన్ఫో తెలుసుకోండి.!
విద్యార్థులకు అత్యంత కీలకమైన AP EAPCET 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది
అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి
APSCHE విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ కౌన్సెలింగ్ జూలై 20 నుంచి ప్రారంభమవుతుంది
AP EAPCET Counselling 2026 : ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు అత్యంత కీలకమైన AP EAPCET 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆన్ లైన్ లో నమోదు చేసుకుని, వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆ తర్వాత వెబ్ ఆప్షన్ కోసం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆధారంగానే కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. APSCHE విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ కౌన్సెలింగ్ జూలై 20 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిలింగ్ కోసం మీరు అనుసరించవలసిన దశలు మరియు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.
SurveyAP EAPCET Counselling 2026 : కౌన్సెలింగ్ దశలు
అర్హత సాధించిన అభ్యర్థులు ఈరోజు నుంచి మొదలయ్యే రిజిస్ట్రేషన్ మొదటి షెడ్యూల్ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవొచ్చు. అయితే, మీరు రిజిస్ట్రేషన్ తర్వాత కూడా కొన్ని దశలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఆ దశలు ఇప్పుడు చూద్దాం.
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
- కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
- వెబ్ ఆప్షన్ నమోదు
- సీట్ అలాట్‌మెంట్
- కాలేజీలో రిపోర్టింగ్
ఈ కంప్లీట్ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు క్లాస్ లో చేరే అవకాశం ఉంటుంది.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
దీనికోసం ముందుగా అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. EAPCET హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు ఇతర వివరాలు నమోదు చేయాలి. తర్వాత, నిర్ణీత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి. ఈ స్టెప్ తర్వాత ఈ-సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత వెబ్ ఆప్షన్ నమోదు చేయాలి.

అయితే, ఈ పూర్తి ప్రాసెస్ కోసం మీకు మీ పూర్తి సర్టిఫికెట్లు మీ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్లు మరియు ఇతర పేపర్స్ పూర్తి లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
- AP EAPCET 2026 ర్యాంక్ కార్డు
- హాల్ టికెట్
- SSC మార్క్స్ మెమో
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
- స్టడీ సర్టిఫికేట్లు
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- EWS సర్టిఫికెట్ (వర్తిస్తే)
- ఆధార్ కార్డు
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
మీరు వెబ్ ఆప్షన్లు ఇస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, మీ ర్యాంక్ కు అనుగుణంగా గత సంవత్సరాల కట్ ఆఫ్ లను పరిశీలించండి. అలాగే, ఎక్కువ సంఖ్యలో కాలేజీలు మరియు బ్రాంచ్ లకు ఆప్షన్లు ఇవ్వండి. మీకు బాగా ఇష్టం ఉన్న మరియు మీ లైఫ్ అంబేషన్ గా ఫీల్ అయ్యే కోర్సులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, చివరి తేదీకి ముందే ఆప్షన్లు సేవ్ చేసి ఫ్రీజ్ చేయండి.
Also Read: Google Pixel 11 Pro మోడల్ డిజైన్ మరియు పిక్సెల్ 11 సిరీస్ Pre-Order డేట్ కూడా అనౌన్స్ చేసింది.!
సీట్ కేటాయించిన తర్వాత అభ్యర్థులు ఆన్ లైన్ లో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్ లోడ్ చేసుకుని, నిర్ణీత తేదీల్లో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
నోట్ : సీట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేయకపోతే, ఆ సీటును కోల్పోయే అవకాశం ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile