లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ బిగ్ డీల్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!

Highlights

లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ బిగ్ డీల్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది

బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కోసం చూస్తున్న యూజర్లకు ఇది బెస్ట్ డీల్

ఈ సౌండ్ బార్ పూర్తి వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు మంచి డాల్బీ అట్మోస్ సౌండ్ అందిస్తుంది

లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ బిగ్ డీల్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కోసం చూస్తున్న యూజర్లకు ఇది బెస్ట్ డీల్ అవుతుంది. కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఇంటిని షేక్ చేసే అద్భుతమైన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కోసం చూస్తున్న యూజర్లు ఈ డీల్ ని పరిశీలించవచ్చు.

boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్

బోట్ రీసెంట్ గా విడుదల చేసిన Aavante Prime X సౌండ్ బార్ ఈరోజు ఈ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మార్కెట్ లో రూ. 39,999 లాంచ్ ప్రైస్ తో అడుగుపెట్టింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 2,350 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

పైన తెలిపి ఆ అన్ని ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 24,649 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పూర్తి వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు మంచి డాల్బీ అట్మోస్ సౌండ్ అందిస్తుంది.

boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ బోట్ 7.1.4 సెటప్ కలిగిన సౌండ్ బార్ రియల్ 3d సరౌండ్ సౌండ్ అని ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ లో ఫ్రంట్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఉంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ ని ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇందులో ముందు 5 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్ మరియు వెనుక ఫ్రంట్ అండ్ ఆఫ్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన శాటిలైట్ అటాచబుల్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఈ మొత్తం సెటప్ లో గొప్ప బేస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

ఈ సౌండ్ బార్ 7.1.4 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ టెక్ మరియు సౌండ్ బార్ స్పీకర్ సెటప్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో సినిమాలు మరియు మ్యూజిక్ మీకు ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ 5.3 వెర్షన్, USB, HDMI eArc, ఆప్టికల్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile