గొప్ప డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby Audio సౌండ్ బార్స్.!
గొప్ప డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్
ఈరోజు మేము అందిస్తున్న బెస్ట్ డీల్స్ మీ కోసం కావచ్చు
ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
గొప్ప డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తుంటే, ఈరోజు మేము అందిస్తున్న బెస్ట్ డీల్స్ మీకోసం కావచ్చు. మీరు బడ్జెట్ యూజర్ అయ్యుండి మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ కోసం వెతుకుతుంటే ఈ డీల్స్ చూడొచ్చు. మరి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey5.1 Dolby Audio సౌండ్ బార్ : ఆఫర్లు
ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. వీటిలో ఒకటి GOVO GOSURROUND 980 సౌండ్ బార్ మరియు రెండోది MOTOROLA AmphisoundX Vibe సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఈ రోజు కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ మరియు ఆఫర్స్ ఇప్పుడు చూద్దాం.

GOVO GO SURROUND 980
ఈ సౌండ్ బార్ ఇటీవల మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈరోజు ఈ సౌండ్ బార్ 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 720 రూపాయల HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ అదనపు డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ . 8,279 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో థియేటర్ వంటి సౌండ్ అనుభూతిని ఇంట్లోనే అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది 525W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
Also Read: Pm Kisan Yojana: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు కీలక అప్‌డేట్ అందించిన కేంద్రం.!
MOTOROLA AmphisoundX Vibe
ఇది మోటోరోలా అందించిన 5.1 సౌండ్ బార్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 79% భారీ డిస్కౌంట్ కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పైన కూడా రూ. 640 రూపాయల అదనపు HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈ ఆఫర్ తో కేవలం రూ. 7,359 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ కూడా 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో కూడా USB, HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
