Pm Kisan Yojana: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు కీలక అప్‌డేట్ అందించిన కేంద్రం.!

HIGHLIGHTS

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు కేంద్రం కీలక అప్డేట్ రిలీజ్ చేసింది

ప్పటికే 22 విడతలుగా దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది రైతులకు కిసాన్ యోజన పథకం క్రింద డబ్బులు అందించింది

ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది

Pm Kisan Yojana: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు కీలక అప్‌డేట్ అందించిన కేంద్రం.!

Pm Kisan Yojana: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు కేంద్రం కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే 22 విడతలుగా దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల మంది రైతులకు కిసాన్ యోజన పథకం క్రింద డబ్బులు అందించింది. ఇప్పుడు 23వ విడత అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు డబ్బులు జమ చేయనున్న సమయంలో గత విడత సమయంలో కొందరు రైతులు చిన్న చిన్న సమస్యలు చూసినట్లు గుర్తించిన కేంద్రం ఈ కొత్త దిశా నిర్ధేశాలను అందించినట్లు చెబుతున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Pm Kisan Yojana: ఏమిటి ఈ పథకం?

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లేదా PM కిసాన్ యోజన పథకం అనేది భారత ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ప్రారంభించిన కీలక సంక్షేమ పథకం ఈ పథకాన్ని 2019 లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

ఈ మొత్తం డబ్బులు మూడు విడతలుగా అంటే, ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో అందిస్తుంది. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

Pm Kisan Yojana: కొత్త అప్డేట్ ఏమిటి?

గత విడతలో కొందరు రైతులు వారి అకౌంట్ లో డబ్బులు పడిన విషయం సరిగా తెలుసుకోలేకపోయినట్లు రైతుల నుంచి విన్నపాలు అందుకున్నట్లు తెలిపారు. అందుకే, ఈ విడతలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి మొబైల్ నెంబర్ లో అమౌంట్ అప్డేట్ తెలిసేలా చేయడానికి కొత్త అప్డేట్ అందించింది.

Pm Kisan Yojana

దీని ప్రకారం, ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందాలంటే e-KYC ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ఎందుకంటే, ప్రభుత్వం e-KYC ప్రక్రియను కూడా తప్పనిసరి చేసింది. ఇలా చేయడం ద్వారా నకిలీ లబ్ధిదారులను నియంత్రించవచ్చు అని కేంద్రం తెలిపింది. అంతేకాదు, CSC కేంద్రాల ద్వారా రైతులు రిజిస్ట్రేషన్, లబ్ధిదారుని స్థితి, వాయిదా వివరాలు వంటి వివరాలను కూడా చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

కొత్త రైతులు ఈ పథకంలో వివరాలు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు, భూమి పత్రాలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా అవసరం. రిజిస్ట్రేషన్ కోసం అధికారిక PM కిసాన్ పోర్టల్ అయిన PM Kisan అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ “New Farmer Registration” ఆప్షన్‌ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నంబర్ నమోదు చేయాలి.

Also Read: Google Pixel 10 5G ఫోన్ పై భారీగా తగ్గింపు ప్రకటించిన గూగుల్ .. కొత్త రేటు ఎంతంటే.!

తర్వాత OTP వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత రైతు వ్యక్తిగత వివరాలు అయిన బ్యాంకు ఖాతా వివరాలు మరియు భూమి సమాచారం నమోదు చేయాలి. అలాగే, అవసరమైన డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నమోదు పూర్తైన తర్వాత ప్రభుత్వం వివరాలు తనిఖీ చేసి అర్హత ఉంటే రైతు ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile