Lava Virat V1 5G: అతి చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

లావా లేటెస్ట్ సిరీస్ నుంచి ఈరోజు రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

Lava Virat V1 5G ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించి అందరి దృష్టిని ఆకర్షించింది

మొదటి రోజు సేల్ నుంచి మాత్రం రూ. 1,000 తగ్గింపుతో కేవలం రూ. 11,999 స్పెషల్ ధరలో లభిస్తుంది

Lava Virat V1 5G: అతి చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Lava Virat V1 5G: లావా లేటెస్ట్ సిరీస్ నుంచి ఈరోజు రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. వాటిలో ఒకటి విరాట్ వి1 4G కాగా రెండోది లావా విరాట్ వి1 4G స్మార్ట్ ఫోన్ ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కూడా ఇండియన్ యూజర్లను ఆకట్టుకునే ధరలో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు వస్తే, లావా మాత్రం ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించి అందరి దృష్టిని ఆకర్షించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Virat V1 5G: ప్రైస్

లావా విరాట్ వి 1 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ తో మాత్రమే అందించింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 12,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, మొదటి రోజు సేల్ నుంచి మాత్రం రూ. 1,000 తగ్గింపుతో కేవలం రూ. 11,999 స్పెషల్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆర్యా బ్లూ మరియు సోనార్ గోల్డ్ అనే రెండు సరికొత్త రంగుల్లో లాంచ్ అయ్యింది. జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ అవుతుంది.

Lava Virat V1 5G: ఫీచర్స్

ఈ ఫోన్ వెనుక సరికొత్త లేజర్ కట్ డిజైన్ అందించింది మరియు ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6.75 ఇంచ్ బిగ్ LCD డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఉన్న స్క్రీన్ HD+ రిజల్యూషన్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8200 Soc చిప్ సెట్ తో వచ్చింది. ఇది ఆక్టా కోర్ చిప్ సెట్ మరియు 4,50,000 కంటే పైగా AnTuTu స్కోర్ అందిస్తుంది. ఇది 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ జతగా 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Lava Virat V1 5G price and features

లావా విరాట్ వి 1 5జి స్మార్ట్ ఫోన్ 13MP Ai డ్యూయల్ రియర్ కెమెరా తో వస్తుంది. అలాగే, 5MP సెల్ఫీ కెమెరా సెల్ఫీలు మరియు కాలింగ్ కోసం లావా అందించింది ఉంటుంది. ఇది లేటెస్ట్ కెమెరా ఫిల్టర్లు మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది 6000 mAh హెవీ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ లావా కొత్త ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం 5 వేల బడ్జెట్ లో 5.1 Dolby Soundbar మీ సొంతం చేసుకోండి.!

ఈ ఫోన్ ప్రస్తుతం బడ్జెట్ ధరలో నడుస్తున్న చాలా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లకు గట్టి పోటీ నిచ్చే ఆకట్టుకునే ఫీచర్స్ ఈ ఫోన్ లాంచ్ అయినట్లు చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile