Google Pixel 10 5G ఫోన్ పై భారీగా తగ్గింపు ప్రకటించిన గూగుల్ .. కొత్త రేటు ఎంతంటే.!

HIGHLIGHTS

Google Pixel 10 5G స్మార్ట్ ఫోన్ పై గూగుల్ ఇప్పుడు భారీ తగ్గింపు ప్రకటించింది

గూగుల్ పిక్సెల్ పవర్ ఫుల్ కెమెరా ఫోన్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూసిన వారికి పండుగ లాంటి వార్త

ఈ ఫోన్ ను గూగుల్ స్టోర్ నుంచి కొనే వారికి ప్రత్యేకమైన అదనపు ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తోంది

Google Pixel 10 5G ఫోన్ పై భారీగా తగ్గింపు ప్రకటించిన గూగుల్ .. కొత్త రేటు ఎంతంటే.!

గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో బేసిక్ ఫోన్ అయిన Google Pixel 10 5G స్మార్ట్ ఫోన్ పై గూగుల్ ఇప్పుడు భారీ తగ్గింపు ప్రకటించింది. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ పవర్ ఫుల్ కెమెరా స్మార్ట్ ఫోన్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూసిన వారికి నిజంగా పండుగ లాంటి వార్త అవుతుంది. కేవలం తగ్గింపు మాత్రమే కాదు ఈ ఫోన్ ను గూగుల్ స్టోర్ నుంచి కొనే వారికి ప్రత్యేకమైన అదనపు ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel 10 5G: ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 79,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ప్రస్తుతం గూగుల్ ఈ ఫోన్ పై రూ. 15,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి రూ. 64,999 తగ్గింపు ధరలో సేల్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ధరలో లభించదు. కేవలం గూగుల్ స్టోర్ నుంచి మాత్రమే ఈ ధరలో లభిస్తుంది.

Google Pixel 10 5G Price Cut

పెయిన్ తెలిపిన ఆఫర్ కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ మరియు రూ. 2,703 రూపాయల విలువైన No Cost EMI సేవింగ్స్ ఆఫర్ ని కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ పై రూ. 20,000 రూపాయల భారీ తగ్గింపు ఈ ఫోన్ పై మీరు అందుకోవచ్చు.

Also Read: Lava Bold N2 5G : లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

Google Pixel 10 5G: ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ లో 6.3 ఇంచ్ OLED ఆక్టువా డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. దీంతో ఈ ఫోన్ సన్ లైట్ లో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G5 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇది AI- ఆధారిత పెర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ మరియు ఫోటోగ్రఫీ ప్రాసెసింగ్ లో చాలా వేగంగా ఉంటుంది.

పిక్సెల్ 10 లో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టం తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్‌కు 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా గూగుల్ అందిస్తుంది. ఈ ఫోన్ 4970 mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ IP68 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

కెమెరా పరంగా, గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఫోన్‌ లో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇది 5x ఆప్టికల్ జూమ్ మరియు 20x సూపర్ రిజల్యూషన్ జూమ్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్, ప్రత్యేకమైన పిక్సెల్ కెమెరా ఫీచర్స్ తో పాటు Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile