మంచి డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న 200W డీప్ బాస్ Soundbar.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో 200W జబర్దస్త్ సౌండ్ అందించే లేటెస్ట్ Soundbar డీల్ ఈరోజు లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ఆఫర్ అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది

ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,850 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

బడ్జెట్ ధరలో 200W జబర్దస్త్ సౌండ్ అందించే లేటెస్ట్ Soundbar డీల్ ఈరోజు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ ఇటీవల ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ అందించిన భారీ డీల్స్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ మరియు ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.

200W Soundbar డీల్

Honeywell ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ Trueno U3000 ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 73% బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ రోజు రూ. 6,499 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 649 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,850 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

Honeywell 200W Soundbar : ఫీచర్స్

ఈ హనీవెల్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు వాల్ మౌంట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో నాలుగు 57mm స్పీకర్లు ఉంటాయి మరియు డీప్ బాస్ ఉఫర్ తో టోటల్ 200W సౌండ్ అందిస్తుంది.

ఈ 2.1 ఛానల్ హనీవెల్ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) చిప్ తో ప్రీమియం ఆడియో అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 3 EQ మోడ్స్ తో వస్తుంది మరియు కంటెంట్ కి తగిన సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, HDMI Arc, AUX, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: OPPO Find X9 Pro: భారీ ఫీచర్స్ తో విడుదలైన ఒప్పో ప్రీమియం ఫోన్.!

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :