ANC vs ENC: కాల్స్ కోసం ఏది బెస్ట్ .. ఆడియో కోసం ఏది బెస్ట్ వివరంగా తెలుసుకోండి.!
ప్రస్తుతం అందరూ కామన్ గా ఉపయోగించే పరికరం ఇయర్ బడ్స్
సైజులో చిన్నగా ఉండే ఇయర్ బడ్స్ ఎక్కువ పనులు నిర్వహించే సత్తా కలిగి ఉంటాయి
ANC మరియు ENC రెండూ శబ్దాన్ని తగ్గించే టెక్నాలజీలు
ప్రస్తుతం అందరూ కామన్ గా ఉపయోగించే పరికరం ఇయర్ బడ్స్. మ్యూజిక్ మరియు కాలింగ్ కోసం ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. తక్కువ సైజులో ఉండే ఇయర్ బడ్స్ ఎక్కువ పనులు నిర్వహించే సత్తా కలిగి ఉంటాయి. అయితే, ఇయర్ బడ్స్ లేదా హెడ్‌ఫోన్స్ కొనుగోలు చేసే సమయంలో ANC మరియు ENC అనే పదాలు తరచుగా కనిపిస్తాయి. వీటిలో ఏది కాల్స్ కు మంచిది? అని చాలా మంది వినియోగదారులు ఆలోచనలో పడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత ఉండదు. వాస్తవానికి, ANC మరియు ENC రెండూ శబ్దాన్ని తగ్గించే టెక్నాలజీలు.అయినప్పటికీ, వాటి పని విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది.
SurveyANC vs ENC: కాల్స్ కోసం ఏది బెస్ట్
ANC మరియు ENC రెండింటిలో కాల్స్ కోసం ఏది బెస్ట్? అని తెలియాలంటే, ముందుగా ఈ రెండు టెక్నాలజీలు ఏమిటి మరియు వీటి పని ఏమిటో తెలుసుకోవాలి.
ANC అంటే ఏమిటి?
ANC (యాక్టీవ్ నోయిస్ క్యాన్సిలేషన్) టెక్నాలజీ ప్రధానంగా ఆడియో అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఇది బయట నుంచి వచ్చే అవసరం లేని శబ్దాలను గుర్తించి వాటిని తగ్గిస్తుంది. ఉదాహరణకు విమానం, బస్సు లేదా రద్దీ ప్రదేశాల్లో సంగీతం వింటున్నప్పుడు ANC చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో మీరు స్పష్టమైన ఆడియోని ఆస్వాదించవచ్చు.
ENC అంటే ఏమిటి?
ENC (ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్) టెక్నాలజీ ప్రధానంగా కాల్స్ కోసం ఉపయోగపడుతుంది. మీరు మాట్లాడుతున్న సమయంలో చుట్టూ ఉన్న వాహనాల శబ్దం లేదా గాలి శబ్దం లేదా ఇతర బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తగ్గించి ఎదుటి వ్యక్తికి మీ వాయిస్ స్పష్టంగా వినబడేలా చేస్తుంది. ముఖ్యంగా, ఆఫీస్ కాల్స్, వీడియో మీటింగ్ మరియు ప్రయాణ సమయంలో ENC చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

కాల్స్ కోసం ఏది బెస్ట్?
మీ ప్రధాన అవసరం ఫోన్ కాల్స్ మరియు వీడియో కాల్స్ అయితే ENC ఉన్న ఇయర్ బడ్స్ ను ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే, ఇది మీ వాయిస్ క్లారిటీ మరింత మెరుగుపరుస్తుంది. మరోవైపు, మీరు ఎక్కువగా మ్యూజిక్ వినడానికి లేదా ప్రయాణ సమయంలో ఎంటర్టైన్మెంట్ కోసం ఇయర్ బడ్స్ కోరుకుంటే ANC మీకు తగిన ఆప్షన్ అవుతుంది.
Also Read: Realme P4R 5G: భారీ 8,000 mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్.!
ఉత్తమ ఎంపిక ఏది?
ప్రస్తుతం మార్కెట్లో లభించే అనేక ప్రీమియం ఇయర్ బడ్స్ లో ANC + ENC రెండూ టెక్నాలజీ సపోర్ట్ అందిస్తున్నారు. ఇలాంటి మోడళ్లను ఎంచుకుంటే సంగీతం వినేటప్పుడు మెరుగైన ఆడియోతో పాటు కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్ నాణ్యత కూడా లభిస్తుంది. కొంచెం ధర ఎక్కువ అయినా ఇలాంటి ఇయర్ బడ్స్ ఎంచుకుంటే మీకు గొప్ప కాలింగ్ మరియు ప్రీమియం ఆడియో వంటి ప్రయోజనాలు సమకూరతాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
