Realme P4R 5G: భారీ 8,000 mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

రియల్‌మీ పి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది

భారీ 8,000 mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది

ఈ కొత్త ఫోన్‌ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది

Realme P4R 5G: భారీ 8,000 mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

Realme P4R 5G: గత కొన్ని రోజులుగా రియల్‌మీ టీజింగ్ చేసిన రియల్‌మీ పి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ 8,000 mAh బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ చూస్తే మీకు మిశ్రమ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ఈ బడ్జెట్ ప్రైస్ లో భారీ 8,000 mAh బ్యాటరీ కలిగిన ఫోనుగా వచ్చినా ఈ ఫోన్ లో బడ్జెట్ చిప్ సెట్, FHD కెమెరా మాత్రమే అందించడం మరియు తక్కువ మినిమమ్ ర్యామ్ తో లాంచ్ చేయడం ఇందుకు కారణం అని చెప్పవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4R 5G: ప్రైస్

రియల్‌మీ పి4 ఆర్ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

  • రియల్‌మీ పి4 ఆర్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర : రూ. 18,999
  • రియల్‌మీ పి4 ఆర్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర : రూ. 20,999
  • రియల్‌మీ పి4 ఆర్ (6 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర : రూ. 22,999

ఈ స్మార్ట్ ఫోన్ సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్ మరియు టైటానియం గ్లేర్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.

Realme P4R 5G price and offers

సేల్ అండ్ ఆఫర్స్

ఇక ఈ ఫోన్ సేల్ డేట్ మరియు ఆఫర్స్ విషయానికి వస్తే, జూన్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ రియల్‌మీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఆఫర్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ ని రియల్‌మీ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 16,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది.

Realme P4R 5G: ఫీచర్స్

ఈ లేటెస్ట్ రియల్‌మీ స్మార్ట్‌ ఫోన్ లో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరియు వీడియో వ్యూవింగ్ మరింత స్మూత్‌ గా ఉంటుంది. అయితే, ఈ ప్రైస్ లో FHD+ రిజల్యూషన్ ఆశించవచ్చు.

ఈ కొత్త ఫోన్‌ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Realme UI 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో లాంచ్ అయ్యింది. అలాగే గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5300mm² ఎయిర్ ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ లో రియల్‌మీ అందించింది.

Realme P4R 5G

కెమెరా విభాగంలో ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా అందించింది. ఇది రోజువారీ ఫోటోగ్రఫీ కోసం మంచి ఫలితాలను అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ కేవలం 30FPS FHD వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఈ ఫోన్ కలిగిన 8000mAh భారీ బ్యాటరీ. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Also Read: EPFO 3.0 New Rules: ఉద్యోగులకు మారనున్న కొత్త PF సేవలు ఇవే.!

అంతేకాదు, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బైపాస్ ఛార్జ్ మరియు 6.5W రివర్స్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, IP65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్, 5G కనెక్టివిటీ మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile