Zebronics Juke Bar 10000 సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. 1100W RMS సౌండ్ అవుట్ పుట్ తో జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా అందించిన పవర్ ఫుల్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ బార్ పై ఈ జబర్దస్త్ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ జస్ట్ ఈ వారమే మార్కెట్ లో అడుగు పెట్టింది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Zebronics Juke Bar 10000 : డీల్
జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసిన ఈ సౌండ్ బార్ ఆరోజు అమెజాన్ సేల్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో రూ. 44,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై HDFC బ్యాంక్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో తో కొనుగోలు చేస్తే రూ. 5,000 రూపాయల భారీ తగ్గింపు అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు. Buy From Here
జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ను ప్రీమియం ఫీచర్స్ మరియు సెటప్ తో అందించింది. ఇది 7.2.4 ఛానల్ సెటప్ కలిగిన సౌండ్ బార్ మరియు టోటల్ 1100W RMS పవర్ ఫుల్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అందులో, 7 ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు 3 ట్వీటర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 520W సౌండ్ అందించే బార్. తర్వాత, ఒక్కొక్క బాక్స్ లో రెండు స్పీకర్లు కలిగిన రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు ఉఫర్స్ మరియు రెండు రేడియేటర్స్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ అందించే సౌండ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ సైడ్, అప్ ఫైరింగ్ మరియు ఫ్రంట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ గా సినిమా హాల్ అనుభూతిని అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది. ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
అధనంగా, మరింత క్రిస్టల్ క్లియర్ సౌండ్ కోసం ZEB AcoustiMax ఫీచర్ ను కూడా ఈ సౌండ్ బార్ లో అందించింది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), ఆప్టికల్ IN, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది.