Super Deal: కేవలం 10 వేల ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

కేవలం 10 వేల ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకునే గొప్ప అవకాశం

స్మార్ట్ టీవీ కి తగిన గొప్ప సౌండ్ బార్ ని కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో

ఈ సౌండ్‌బార్ డీల్ ఈరోజు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది

Super Deal: కేవలం 10 వేల ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

Super Deal: ఈరోజు కేవలం 10 వేల ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకునే గొప్ప అవకాశం మీ కోసం ఎదురు చూస్తోంది. మీ స్మార్ట్ టీవీ కి తగిన గొప్ప సౌండ్ బార్ ని కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్స్ మీ కోసమే కావచ్చు. ఇది ఇటీవల కూడా 13 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు అన్ని ఆఫర్స్ తో కలిపి చాలా చవక ధరలో మీకు లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Super Deal: 5.1 Dolby Atmos సౌండ్ బార్

అమెజాన్ ఇండియా నుంచి ఈ సౌండ్‌ బార్ డీల్ ఈరోజు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఇక డీల్ వివరాల్లోకి వెళితే, బోట్ 2025 లో విడుదల చేసిన 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ బార్, Aavante Prime 5.1 5000DA ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్‌ బార్ గత సంవత్సరం భారత్‌ లో రూ.14,999 ధరతో లాంచ్ అయింది. అయితే, ఈరోజు అమెజాన్‌ ఇండియా అందించిన రూ.3,000 డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 ధరలో లిస్ట్ అయింది.

Super Deal 5.1 Dolby Atmos Soundbar

ఇది మాత్రమే కాకుండా, అమెజాన్ ఈ బోట్ సౌండ్‌ బార్‌ పై రూ.1,199 రూపాయల బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే, ఈ సౌండ్‌ బార్‌ ను కేవలం రూ.10,800 రూపాయల అతి తక్కువ ధరలో అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ సౌండ్ బార్ ను కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read: Jaana Dogan: AI శక్తి గురించి విస్తుపోయే నిజాలు తెలిపిన గూగుల్ ఇంజనీర్.!

బోట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఇక ఈ బోట్ 5.1 ఛానల్ సౌండ్ కలిగిన ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఇది మూడు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అందిస్తుంది. ఇది బోట్ సిగ్నేచర్ సౌండ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఈ సౌండ్ బార్ ను ఈ ప్రైస్ లో వచ్చే మిగిలిన సౌండ్ బార్స్ నుంచి ఈ సౌండ్ బార్ ను వేరు చేస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 5.1 సెటప్, 500W సౌండ్ అవుట్ పుట్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో సినిమా హాల్ వంటి గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile