2021 నుంచి ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు

2021 నుంచి ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు
HIGHLIGHTS

2021 నుండి కొన్నిఫోన్లలో Whatsapp పనిచెయ్యడం ఆగిపోతుంది.

ఈ లిస్టులో iOS మరియు ఆండ్రాయిడ్ రెండు OS లలో పనిచేసే స్మార్ట్ ఫోన్లు

కొత్త సంవత్సరంలో ఈ స్మార్ట్ ఫోన్లు Whatsapp అర్హతను కోల్పోతాయి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం వున్నా చాటింగ్ యాప్ Whsatapp వచ్చే సంవత్సరం అంటే 2021 నుండి కొన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచెయ్యడం ఆగిపోతుంది. ఈ లిస్టులో iOS మరియు ఆండ్రాయిడ్  రెండు OS లలో పనిచేసే స్మార్ట్ ఫోన్లు వున్నాయి. అంటే, ఈ స్మార్ట్ ఫోన్లలో రానున్న కొత్త సంవత్సరంలో Whatsapp అర్హతను కోల్పోతాయి.

ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ Whatsapp, పాత OS ల పైన చేసే స్మార్ట్ ఫోన్లకు సపోర్ట్ ని నిలిపివేయనుంది. కాబట్టి, ఈ పాత OS ల పైన ఆధారపడి పనిచేసే ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్ ఫోన్లలో ఇక వాట్స్ అప్ యాప్ పనిచెయ్యదు.

ఇక ఎటువంటి ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్ ఫోన్ల పైన ఈ ప్రభావం ఉంటుందనే విషయానికి వస్తే, iOS 9 మరియు ఆండ్రాయిడ్ 4.0.3 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పైన చేసే ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్ ఫోన్లలో Whatsapp పనిచెయ్యడం ఆపేస్తుంది. వాట్స్ అప్ చెబుతుందంటే, తమ పూర్తి సర్వీసులను అందించాలనంటే వారి ఆపరేటింగ్ సిస్టం యొక్క లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ అవ్వాలని సూచిస్తోంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్ల విషయానికి వస్తే, చాలా తక్కువ మంది మాత్రమే 4.0.3 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పైన చేసే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను కలిగి వున్నారు. iOS  పరంగా ఐఫోన్ 4 యూజర్లు తమ వాట్సాప్ ఫీచర్స్ ను కోల్పోతారు. ఇంకా  మరికొన్ని iOS ఫోన్లు iOS 9 కు అప్డేట్ అవ్వాల్సివుంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo