WhatsApp Update: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.!

WhatsApp Update: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.!
HIGHLIGHTS

వాట్సాప్ యూజర్ లకు అదరగొట్టే న్యూస్ అందించిన వాట్సాప్

అత్యధికంగా యూజర్ బేస్ ను కలిగి ఉన్న వాట్సాప్ లో కొత్త అప్డేట్ వచ్చింది

ఈ అప్డేట్ తో యూజర్లు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని పొందుతారు

WhatsApp Update: వాట్సాప్ యూజర్ లకు అదరపు అందించిన వాట్సాప్. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా యూజర్ బేస్ ను కలిగి ఉన్న వాట్సాప్ కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తో యూజర్లు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని పొందుతారని తెలుస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్ వాట్సప్ యూజర్ల స్టేటస్ పైన పనిచేస్తుంది.

WhatsApp Update:

యూజర్లకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన సర్వీస్ ను అందించడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జత చేస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా యూజర్లకు సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన అప్డేట్ ను అందించింది. అసలు విషయం ఏమిటంటే వాట్సాప్ లో యూజర్లకు అత్యంత ప్రీతిపాత్రమైన స్టేటస్ పైన ఈ కొత్త అప్డేట్ ను అందించింది.

WhatsApp Update
WhatsApp Update

ఇప్పటి వరకూ కేవలం 30 సెకండ్లు మాత్రమే వాట్సప్ స్టేటస్ సెట్ చేసే అవకాశం ఉంది. అయితే, కొత్త అప్డేట్ ద్వారా వాట్సాప్ స్టేటస్ నిడివిని ఒక నిమిషానికి పెంచేసింది. అంటే, ఇకనుండి యూజర్లు ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలను లేదా ఫోటోలను వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేయవచ్చు.

Also Read: Gold Price: గరిష్ట రేటు వద్దే స్థిరంగా బంగారం ధర.!

వాట్సప్ స్టేటస్ ను ఎక్కువగా ఉపయోగించే యూజర్లకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది. లాంగ్ వీడియోలను విడివిడిగా పోస్ట్ చేసే పని లేకుండా వన్ మినిట్ వరకు స్టేటస్ లో పోస్ట్ చేయవచ్చు.

వాట్సప్ ఇప్పటి వరకూ అందించిన చాలా ఫీచర్ల ద్వారా యూజర్లు మంచి అనుభూతిని పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ అవకాశం ద్వారా వాట్సాప్ యూజర్లు గొప్ప అనుభూతులు పొందుతారని చెప్పవచ్చు.

ఆంతేకాదు, త్వరలోనే వాట్సాప్ మరిన్ని ఫీచర్లను జత చేసి అవకాశం ఉందని తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo