WhatsApp Holi Features added for 2026 holi festival
WhatsApp Holi Features: 2026 హోలీ పండుగ కోసం అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసింది. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. నార్త్ ఇండియాలో ఈ పండుగ చాలా ఆహ్లాదకరంగా జరుపుకోబడుతుంది. మన హైదరాబాద్ లో కూడా హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు. అందుకే, ఈ ముఖ్యమైన పండుగ కోసం ప్రత్యేకంగా కొన్ని ఉపయోగకరమైన మరియు ఫన్ ఫీచర్లను వాట్సాప్ కొత్తగా అందించింది.
గ్రూప్ వాయిస్ చాటింగ్ మొదలుకుని మ్యూజిక్ స్టేటస్ స్టోరీ వరకు చాలా కొత్త ఫీచర్స్ ను వాట్సాప్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ తో 2026 హోలీ పండుగ మరింతా ఆహ్లాదంగా మారుస్తుంది.
వాట్సాప్ అందించిన కొత్త ఫీచర్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ గ్రూప్ వాయిస్ చాట్ ఫీచర్. మాటి మాటికీ టైపు చేసి చదువుతూ మరియు మెసేజ్ చెక్ చేసే బరువును తగ్గిస్తూ, మీరు గ్రూప్‌లో హోలీ ప్లాన్ కోసం వాయిస్ చాట్ ను ప్రారంభించవచ్చు. ఇది టైప్ చేసే సమయాన్ని మరియు శ్రమను తగ్గిస్తుంది.
కాల్ షెడ్యూలింగ్ ఫీచర్ ఈ పండుగ కోసం అందించిన ఫీచర్స్ లో బెస్ట్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా పండుగ రోజు ముందుగా ఫిక్స్ చేసుకున్న సమయంలో కుటుంభం లేదా ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి కాల్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ తో గ్రూప్ లేదా ఫ్యామిలీతో Video లేదా Voice Call ను ముందుగా షెడ్యూల్ చేసుకోవచ్చు.ఈ షెడ్యూల్ చేసిన సమయానికి అందరూ తగిన సమయానికి జాయిన్ కావచ్చు.
ఈ కాల్ షెడ్యూల్ ఫీచర్ ను ఉపయోగించడానికి, మీ వాట్సాప్ కాల్స్ టాబ్ లో + ఐకాన్ ను నొక్కండి. నొక్కిన వెంటనే కాల్ షెడ్యూల్ అని వస్తుంది. తర్వాత మీరు కోరుకునే గ్రూప్ మరియు టైమ్ ను సెట్ చేయండి. అంతే, కాల్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు సెట్ చేసిన సమయానికి కాల్ కనెక్ట్ అవుతుంది.
Also Read: Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ గొప్ప తగ్గింపు అందించిన అమెజాన్.!
ఇది ఒక ప్రత్యేకమైన మరియు మీకు నచ్చిన వారిని సర్‌ప్రైజ్ చేసే ఫీచర్. ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ యూజర్లు ఇప్పుడు Status లో 60 సెకన్ల పాటు బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ జోడించవచ్చు. మీ హోలీ ఫోటోలు మరియు స్లో మోషన్ వీడియోస్ తో మీకు నచ్చిన మ్యూజిక్ తో మరింత కొత్తగా మారతాయి.
ఫోటోలు లేదా టెక్ట్స్ నుంచి కస్టమ్ స్టిక్కర్లు తయారు చేసి షేర్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ తో Holi సందేశాలు, జోక్స్, గ్రీటింగ్స్ అన్నీ ప్రత్యేకంగా అనిపిస్తాయి.