TRAI ఛానల్ సెలెక్టర్ అప్లికేషన్ను ప్రారంభించింది : ఛానళ్లను ఎంచుకోవడం ఇప్పుడు చాల సులభం

HIGHLIGHTS

చందాదారులు సులభంగా వారికి కావలసిన ఛానెల్ని ఎంచుకోవచ్చు.

TRAI ఛానల్ సెలెక్టర్ అప్లికేషన్ను ప్రారంభించింది : ఛానళ్లను ఎంచుకోవడం ఇప్పుడు చాల సులభం

ముఖ్యాంశాలు :

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. TRAI ఛానల్ సెలెక్టర్ అప్లికేషన్ను ప్రారంభించింది

2. ఇది ఛానెల్ ధర నిర్ణయిస్తుంది

3. చందాదారులు సులభంగా వారికి కావలసిన ఛానెల్ని ఎంచుకోవచ్చు

ఇటీవలే, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), ఒక ఆదేశాన్ని జారీచేసింది. అదేమిటంటే, ఛానల్ ప్రొవైడర్లు వారు ఛానెళ్లు ప్రసారం చేయడానికి ఛానళ్ల ధర నిర్ణయించబడుతుంది. కేబుల్ లేదా డిటిహెచ్ యూజర్లు తాము ఎంచుకున్న ఛానళ్ల కోసం లేదా తాము ఉపయోగించే వాటి కోసం మాత్రమే చెల్లించాలని ఇది నిర్ధారిస్తుంది. అంతేకాదు, వారు ఏ ఛానెల్ కోసం ప్రత్యేక చెల్లింపు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అదనంగా, వినియోగదారులు Installation  ఛార్జీలు, నెలవారీ అద్దె ప్రాథమిక రుసుము వంటి వివిధ ఛార్జీల నుండి కూడా భారం తగ్గనుంది .

అదే సమయంలో, DTH ప్రొవైడర్ మరియు చందాదారులతో ట్రాయ్ ఇప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవిధ్యంగా ఉండే  ఈ కొత్త నియమానికి చందాదారులు మారడానికి చాలా సమయం పడుతుంది. టాటా స్కై వంటి కొందరు DTH ప్రొవైడర్లు, ఛానల్ కోసం తమ ధరలను నిర్ణయించడంలో  తటస్థించారు. దీనివలన, జనవరి 31 తర్వాత తమ సేవను ఆపివేయకూడదని చందాదారుల ఆందోళన చెందేందుకు ఇది కారణం కావచ్చు.

TRAI ప్రకారం,  New Network Capacity Fee

TRAI యొక్క ఈ కొత్త App తో  వినియోగదారులు తమ అభిమాన ఛానెల్ని సులభంగా ఎంచుకోవచ్చు. దీనితో వారు తమ నెలవారీ అద్దెని కూడా తెలుసుకుంటారు. TRAI, వినియోగదారుల కోసం 100 SD ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్ళను ఉచితంగా ప్రసారం చేయటానికి నెట్వర్క్ సామర్థ్య రుసుము (NCF) 130 నెలవారీ అద్దెను నిర్ణయించింది. దీనితో TRAI రెండు రకాలైన ఛానళ్ళు, FTA మరియు పే చానెల్స్ ను ఏర్పాటు చేసింది. యూజర్లు 100 కన్నా ఎక్కువ చానెళ్లను చూడాలనుకుంటే, అప్పుడు వారు 20 రూపాయల చెల్లింపు ద్వారా సులభంగా వారికీ కావాల్సిన చానెళ్లను తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 110 ఛానెళ్లను తీసుకుంటే ప్రతి నెలా 150 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది నెట్వర్క్ సామర్థ్య ఫీజులో 130 రూపాయలు మరియు అదనపు రుసుము 20 రూపాయలు ఉంటుంది.

ట్రాయ్ ఛానల్ సెలెక్టర్ అప్లికేషన్ అంటే ఏమిటి?

ట్రాయ్ యొక్క ఛానల్ సెలెక్టర్ అప్లికేషన్ సహాయంతో, వినియోగదారులు వారి ఛానల్ ప్యాకేజీ యొక్క MRP ని గురించి తెలుసుకోవచ్చు. కావలసిన ఛానెల్లను జోడించినప్పుడు, ఈ ఆప్ చందాదారులు చెల్లించాల్సిన మొత్తం ఛానళ్ల యొక్క మొత్తం ధరను చూపుతుంది. వినియోగదారులు తమ ప్రొడక్టులను ఆన్లైన్ షాపింగ్ సైట్లో షాపింగ్ కార్టుకు జోడించడం ద్వారా,  కావల్సిన ఛానెల్ యొక్క ఎంపిక సులభం అవుతుంది. వినియోగదారులు ఎంచుకున్న అన్ని ఛానళ్లను వీక్షించగలరు. దీనితో, మీకు ఏ ఆఫర్ అయినా అందుబాటులో ఉంటే, ఈ ఆప్ మీ ఛానెల్ యొక్క ధరలకు, ఆ ఆఫర్ను జోడిస్తుంది మరియు మీ ఛానెళ్ల యొక్క సంఖ్యను  తగ్గించకుండా ఆ ఛానెల్ యొక్క ధరను తగ్గించవచ్చు. వినియోగదారులు, ఈ ఆప్ నుండి వారి ఛానెల్ను ప్రింట్ మరియు డౌన్లోడ్ చేయవచ్చు.

మీరు ట్రాయ్ ఛానల్ సెలెక్టర్ అనువర్తనాన్ని తెరిచినప్పుడు, మీరు మీ పేరు, భాష, రాష్ట్రం, ఇష్టమైన జెన్నర్ వంటి కొన్ని సమాచారాన్ని ఇవ్వాలి, దాని తర్వాత మీరు ఎంపిక ప్రక్రియకు వెళతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo