Realme Narzo 90 మరియు NARZO 90x రేపు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి.!

HIGHLIGHTS

Realme Narzo 90 మరియు NARZO 90x రేపు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి

నార్జో 90 సిరీస్ నుంచి ఈ రెండు ఫోన్లు కూడా రియల్ మీ లాంచ్ చేస్తోంది

ఈ రెండు కొత్త ఈ ఫోన్స్ డిజైన్ మరియు చాలా కీలక ఫీచర్స్ కూడా కంపెనీ అందించింది

Realme Narzo 90 మరియు NARZO 90x రేపు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి.!

Realme Narzo 90 మరియు NARZO 90x రేపు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. నార్జో 90 సిరీస్ నుంచి ఈ రెండు ఫోన్లు కూడా రియల్ మీ లాంచ్ చేస్తోంది. ఈ రెండు కొత్త ఈ ఫోన్స్ డిజైన్ మరియు చాలా కీలక ఫీచర్స్ కూడా కంపెనీ అందించింది. రేపు విడుదల కాబోతున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కీలక ఫీచర్లు లాంచ్ కంటే ఒకరోజు ముందే తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 90 మరియు NARZO 90x: లాంచ్

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతాయి. ఈ రెండు ఫోన్లు కూడా అమెజాన్ స్పెషల్ ఫోన్స్ గా ఇండియాలో లాంచ్ అవుతున్నాయి.

Realme Narzo 90 and NARZO 90x

Realme Narzo 90 : కీలక ఫీచర్స్

ఈ ఫోన్ విక్టరీ పవర్ డిజైన్ తో ఉంటుంది కేవలం 7.79mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి ముందు మరియు మరొకటి సెల్ఫీ కెమెరా. ఈ ఫోన్ Ai ఎడిట్ జీనీ మరియు ఎఐ ఎడిటర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది.

Also Read: మీ Smartphone లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి.!

Realme Narzo 90x : కీలక ఫీచర్స్

ఈ ఫోన్ కూడా రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఏరో ఫ్లో డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు బోల్డ్ వైబ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 400% బిగ్ సౌండ్ అందించే అల్ట్రా వాల్యూమ్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP సోనీ Ai డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఎఐ ఎడిట్ జీనీ + ఎఐ ఎడిటర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile