టాప్ 5 ఆండ్రాయిడ్ కారు రేసింగ్ గేమ్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 28 Nov 2018
HIGHLIGHTS
  • ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు అద్భుతమైన గేమింగ్ అనుభూతినిస్తాయి ఈ గేమ్స్

టాప్ 5 ఆండ్రాయిడ్ కారు రేసింగ్ గేమ్స్

మొదటి నుండి ఫైనల్ లైన్ వరకు ఉత్కంతంగా నడిచే ఒక కారు రేసును ఎవరు ఇష్టపడరు? ఆప్ స్టోరులో,  నిరంతరం మెరుగుపరచబడిన గ్రాఫిక్స్ మరియు ఆటతీరుతో వారి మార్కును నిలబెట్టుకునే కొన్ని గేమ్స్ నుండి టాప్ 5 గేమ్లను,  ఈ రోజు మేనము చూద్దాం! (ఉత్తమైన వాటినుండి  తీసుకున్న టాప్ 5 గేమ్స్ మాత్రమే)  మీరుకూడా ఈ గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన గేమ్ పేరుపైన నొక్కడంతో ఆప్ స్టోర్ లోకి వెళతారు, అక్కడ గేమ్ డౌన్ లోడ్ చేసుకొని ఆడవచ్చు.       

Asphalt 9

ఆస్పాల్ట్ 8 అబ్భుతమైన విజయాన్ని సాధించడంతో, దానికి కొనసాగింపుగా ఈ ఆస్పాల్ట్ 9 ని తీసుకొచ్చింది. ఈ కొత్తగా వచ్చిన గేములో కొత్త వాతావరణము, ఛాలెంజ్ మరియు స్టంట్లను తీసుకొస్తుంది. అంటే, ఇపుడు మరింత గేమింగ్ అనుభూతిని పొందవచ్చు ఈ ఆస్పాల్ట్ 9 గేముతో. అలాగే ఇందులో కొత్త కార్లు  మరియు  సులభమైన కంట్రోల్స్ కూడా తీసుకొచ్చింది.

Drift Max City -Car Racing in City

ఈ డ్రిఫ్ట్ మ్యాక్స్ సిటీ గేమ్ ఆడుతున్నప్పుడు, నిజమైన రోడ్డు మీద రేసింగ్ చేస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది మరియు ఇందులో హై పెరఫార్మెన్సు కార్లను ఇందులో మీరు డ్రైవ్ చేయవచ్చు. ఈ గేములో 14 డ్రిఫ్ట్ కార్లను అందిస్తుంది మరియు 7 రేస్ ట్రాక్లను కూడా అందిస్తుంది. మీరు రేసింగ్ చేసేటప్పుడు ఈ ప్లేస్ తెలిపే విధంగా స్కోర్ బోర్డు కూడా చూడవచ్చు .      

Impossible Car Game 2018

మీరు ఎక్కువ చాలెంజింగ్ ఉండేటువంటి గేమ్లను ఇష్టపడేవారైతే కనుక ఈ గేమ్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ గేమ్ లో అనేకరకాలైన ఆశ్చర్యకర విన్యాసాలను మీరు చేయవలసివుంటుంది.  మెలితిరిగిన మార్గాలు మరియు ఘోరమైన అడ్డంకులవంటి వాటిని దాటుకుంటూ మీ కారును నడపవలసివుంటుంది.

Real Racing 3

ఈ రియల్ రేసింగ్ 3 గేమ్ అధికారకంగా ద్రువీకరించబడిన ట్రాక్స్ తో వస్తుంది మరియు వేగవంతమైన కార్లతో  మంచి గేమింగ్ అనుభూతినిస్తుంది. ఈ గేములో, మీరు అనేక కెమేరా వ్యూస్ అందుకోవచ్చు మరియు ఈ ఆట తీరు చాల సున్నితంగా ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రాఫిక్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది.

Need For Speed : No Limits

నీడ్ ఫర్ స్పీడ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదనుకుంటా, ఎందుకంటే ఇప్పటివరకూ వచ్చిన ఈ గేమ్ సిరీస్లలో చాల ప్రాచుర్యాన్ని పొందిన వాటిలో ఇది కూడా ఒకటి. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు చాల ఎక్సయిట్మెంట్ గా ఉంటుంది మరియు ఇప్పుడు కోతగా తెచ్చిన గ్యారేజితో మీ కారును మీకు కావలసినట్లుగా మార్చుకునే అవకాశంకూడా అందించింది.       

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
car racing games top 5 racing games best racing games
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status