TATA Neu: టాటా సూపర్ యాప్ ఏప్రిల్ 7 న వస్తోంది.. ఇక ఒకే యాప్ పైన కంప్లీట్ షాపింగ్..!!

HIGHLIGHTS

TATA Neu ను ఏప్రిల్ 7 న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది

టాటా న్యూ యాప్ మరో రెండు రోజుల్లో ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది

ఈ ఒక్క యాప్ ఉంటే అన్ని సర్వీసులకు మార్గం సుగమం అవుతుంది

TATA Neu: టాటా సూపర్ యాప్ ఏప్రిల్ 7 న వస్తోంది.. ఇక ఒకే యాప్ పైన కంప్లీట్ షాపింగ్..!!

టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న సూపర్ యాప్ TATA Neu ను ఏప్రిల్ 7 న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ కోసం టాటా ఉద్యోగస్తులకు మాత్రమే అందుబాటులో ఉంచింది మరియు మరో రెండు రోజుల్లో ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చెల్లింపులు, షాపింగ్, ట్రావెల్ బుకింగ్, కిరాణా సామాగ్రి మరియు మరెన్నో సేవలను అందిస్తున్నAmazon, Jiomart, Paytm వంటి ఇతర ప్రముఖ సూపర్ యాప్‌లతో TATA Neu పోటీ పడుతుంది. మరి ఈ కొత్త సూపర్ యాప్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TATA Neu: ఏంటి ఈ యాప్

టాటా న్యూ యాప్ అనేది ఒక సూపర్ యాప్ మరియు ఇది అన్ని రకాల డిజిటల్ సర్వీసులను ఒకేచోట అందిస్తుంది. అంటే, డిజిటల్ పెమెంట్స్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్, కిరాణా సామాగ్రి వంటి మరెన్నో షాపింగ్ సర్వీసులను ఒకే యాప్ లో అందిస్తుంది. అంటే, ఈ ఒక్క యాప్ ఉంటే అన్ని సర్వీసులకు మార్గం సుగమం అవుతుంది.

ట్విట్టర్ ద్వారా టాటా న్యూ యాప్ త్వరలోనే రాబోతున్న విషయాన్నీ గురించి ట్వీట్స్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, టాటా న్యూ యాప్ ద్వారా చేసే కొనుగోళ్లకు NeuCoin లను పొందవచ్చని చెబుతోంది. ఈ న్యూ కాయిన్ విలువ కూడా రూపాయికి సమానంగా ఉంటుంది మరియు ఈ యాప్ ద్వారా ఈ కాయిన్స్ ను రిడీమ్ కూడా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఈ యాప్ ప్రస్తుతం టాటా కంపెనీ ఎంప్లాయిస్ కోసం అందుబాటులో వుంది Play Store లో ఈ యాప్ 105 MB సైజుతో వుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 5.0 మరియు అంతకంటే పైబడిన ఆండ్రాయిడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్లలో సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo