Paytm First వచ్చేసింది : అమేజాన్ ప్రైమ్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లస్ లకు పోటీకానుందా?

HIGHLIGHTS

ఇది ఫుడ్, మ్యూజిక్, ట్రావల్ మరియు మరిన్ని ఫీచర్లను, దీనితో అందించనుంది.

Paytm First వచ్చేసింది : అమేజాన్ ప్రైమ్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లస్ లకు పోటీకానుందా?

ఇప్పుడు పేటియం కూడా అమేజాన్ ప్రైమ్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లస్ తరహాలోనే, తన వినియోగదారులకి ఎంటర్టైన్మెంట్ మరియు ట్రావెలింగ్ మరియు మరిన్ని అవసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి తన ప్లాట్ఫారం పైన అందించనుంది. దీన్నీ,  Paytm First గా చెబుతోంది మరియు paytm ఇప్పటికే నోటిఫికేషన్లను కూడా తన వినియోగదారులకి అందించింది. అయితే, ఇది ఉచితం మాత్రం కాదు, దీన్నీ ఒక సంవత్సరం చందాదారులు అవ్వడానికి 750 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ తక్కువ రుసుముతో మీకు ఎక్కువ ప్రయోజాలనే అందిస్తుందని చెప్పొచ్చు.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Paytm First ప్రయోజనాలు

1. ఈ Paytm First చందాదారులుగా చేరడానికి ముందుగా 750 రూపాయల రుసుమును చల్లించాల్సి ఉంటుంది.

2.  మీ పేటియం వాల్లెట్ లో డబ్బును యాడ్ చేయటంతో, మీకు 360 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుతుంది.

3. దీన్నితో ఒక సంవత్సరం వరకు Eros సబ్ స్క్రిప్షన్ ఉచితంగా దొరుకుతుంది. వాస్తవానికి దీని ధర రూ. 470.

4. అలాగే, Sony LIV మరియు ViU లకు కూడా ఒక సంవత్సరం ఫ్రీ  సబ్ స్క్రిప్షన్ అందుకుంటారు. ఈ రెండు కలిపి దాదాపుగా 800 రూపాల వరకు ఉంటుంది.

5. మ్యూజిక్ : Gana మరియు Wynk ప్రీమియం లకు కూడా మీరూ ఒక సంవత్సరం ఫ్రీ  సబ్ స్క్రిప్షన్ అందుకుంటారు.                

6. ఫుడ్ & ట్రావెల్ : Uber యొక్క 180 రోజుల పాస్ మీకు అందించబడుతుంది దీనితో మీరు తక్కువ ధరలతో ఉబర్ క్యాబ్లో ప్రయాణం చేయవచ్చు. అలాగే, Zomato Gold మరియు Uber Eats లకు కూడా మీకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందుతుంది.        

ఇది అందించే ప్రయోజానాలను అన్నింటిని కలుపు కుంటే దాదాపుగా 6000 రూపాయల వరకు మీకు లాభం చేకూరుకుతుంది.    

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo