Instagram బిగ్ ఫీచర్ కి మంగళం పాడుతున్న Meta .. ఆ ఫీచర్ ఏమిటంటే.!

HIGHLIGHTS

Instagram యొక్క బిగ్ అప్డేట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తోంది

ఒక ముఖ్యమైన ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్ కి ఇంస్టాగ్రామ్ మంగళం పాడుతోంది

ఈ ఫీచర్ తొలగింపుతో ఇంస్టాగ్రామ్ చాట్ ఇక మరింత సురక్షితంగా మారుతుంది

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ‘Instagram’ యొక్క బిగ్ అప్డేట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా ఉపయోగించే మరియు ఉపయోగకరమైన ఇంస్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ లో ఉన్న End-to-End ఎన్క్రిప్టెడ్ చాట్ ఫీచర్ ను త్వరలో నిలిపివేస్తున్నట్లు, ఇంస్టాగ్రామ్ యాజమాన్య కంపెనీ Meta తెలిపింది. ఇది ఇంస్టాగ్రామ్ లో వ్యక్తిగత చాట్స్‌ కు ఉన్న ఒక ముఖ్యమైన ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్ మరియు ఇంస్టాగ్రామ్ ఈ బిగ్ ఫీచర్ కి మంగళం పాడుతోంది.

ఏమిటా Instagram బిగ్ ఫీచర్?

ఇంస్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ లో ఉన్న End-to-End ఎన్క్రిప్టెడ్ చాట్ ఫీచర్ ను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు మెటా తెలిపింది. దీంతో కేవలం పంపిన వ్యక్తి మరియు అందుకున్న వ్యక్తి మాత్రమే చూడటానికి అవకాశం ఉన్న మెసేజ్, ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది. మధ్యలో ఉన్న సర్వర్లు లేదా ప్లాట్‌ ఫామ్ కూడా ఈ మెసేజ్‌ను చూడలేవు. అంటే, ఇది పూర్తి సీక్రెట్ గా ఉంటుంది. అయితే, ఇంస్టాగ్రామ్ లో ఇక నుంచి ఈ ఫీచర్ కనుమరుగవుతుంది. ఈ ఫీచర్ తొలగింపుతో ఇంస్టాగ్రామ్ చాట్ ఇక మరింత సురక్షితంగా మారుతుంది.

ఈ ఫీచర్‌ తొలగించడానికి కారణం ఏమిటి?

Meta ప్రకారం, ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఈ ఫీచర్ న చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. కోట్ల మంది యూజర్లను కలిగిన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫీచర్ అతి తక్కువ మంది ఉపయోగిస్తున్న ఫీచర్ గా నిలిచింది. అందుకే, ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్ ఫీచర్ ను తొలగిస్తున్న మెటా చెబుతోంది.

కేవలం తక్కువ మంది ఉపయోగించడం మాత్రమే ప్రధాన కారణం కాదు. ఇంస్టాగ్రామ్ ఎన్క్రిప్టెడ్ చాట్ ను తొలగించడం ద్వారా మరింత సురక్షితమైన ఇంస్టాగ్రామ్ ను ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న ఎన్ క్రిప్టెడ్ చాట్ ఫీచర్ చాలా దేశాల రక్షణ మరియు సెక్యూరిటీ కి కూడా భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ మెసేజెస్ ఎన్క్రిప్టెడ్ అయిన కారణంగా అక్రమ కార్యకలాపాలను గుర్తించడం కష్టమవుతుందని రక్షణ సంస్థలు పేర్కొంటున్నాయి. అందుకే, ఇంస్టాగ్రామ్ లో ఈ ఫీచర్ ను తొలగించడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతున్నారు.

Also Read: TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

యూజర్ పై ఎటువంటి ప్రభావం ఉంటుంది?

ఈ ఫీచర్ ను తొలగించడం వలన యూజర్ పై పెద్దగా ఏమి ప్రభావం చూపించదు. అయితే, ఇంస్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ (DMs) లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండదు. ఇక నుంచి మెసేజ్‌లు సాధారణ చాట్స్ మాదిరిగా స్టోర్ అవుతాయి. ఒకవేళ మీరు పాత మెసేజ్ ను పొందాలనుకుంటే ముందగా డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్ 2026 మే 8 నుంచి ఇక అందుబాటులో ఉండదని మెటా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :