ఇక Instagram పైన వచ్చే కామెంట్స్ డిలేట్ లేదా రిపోర్ట్ చేసే కొత్త ఫీచర్

ఇక Instagram పైన వచ్చే కామెంట్స్ డిలేట్ లేదా రిపోర్ట్ చేసే కొత్త ఫీచర్
HIGHLIGHTS

ప్రజలు తమ పోస్ట్ లేదా కామెంట్ లో మిమ్మల్ని ట్యాగ్ చేయకుండా నిరోధించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ యాప్ లో పెద్ద మార్పు చేసింది. ఈ కొత్త మార్పు తర్వాత మీరు మీ కంటెంట్‌పై మరింత నియంత్రణను పొందనున్నారు. Facebook యొక్క ఈ ఫోటో మరియు వీడియో షేరింగ్ యాప్, మీ పోస్ట్ పైన ఇతరులు కామెంట్ చేయకుండా నిరోధించడానికి లేదా మల్టి కామెంట్స్ ను డిలీట్ చేయడానికి  మీకు అనుమతినిస్తుంది. ఇది కాకుండా, మీరు కామెంట్ టాప్ ‌లో పిన్ చేసే సదుపాయాన్ని కూడా  పొందుతారు మరియు ప్రజలు తమ పోస్ట్ లేదా కామెంట్ లో మిమ్మల్ని ట్యాగ్ చేయకుండా నిరోధించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ ఒక బ్లాగ్ పోస్ట్ ‌లో "మొదట మేము మల్టి చాట్స్ ను నిర్వహించే సదుపాయాన్ని ప్రజలకు ఇస్తున్నాము. ప్రతికూల కామెంట్స్  నిర్వహణ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మాకు తెలుసు, కాబట్టి  కామెంట్స్ ని పెద్దమొత్తంలో డిలీట్ చేసే సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాము" అని తెలిపింది. అలాగే నెగటివ్ కామెంట్స్ ను పోస్ట్ చేసే మల్టి అకౌంట్స్ ను నిరోధించడం లేదా పరిమితం చేయడం వంటివి చెయ్యోచ్చు.

ఈ ఫీచర్ కోసం పరీక్షలు సానుకూలంగా ఉన్నాయని మరియు iOS మరియు Android లో ఈ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా మీరు ఫీచర్‌ను మొదలుపెట్టవచ్చని కూడా సంస్థ తెలిపింది.

  • పోస్ట్‌లోని కామెంట్ పైన నొక్కండి.
  • కుడి మూలలో చుక్కల చిహ్నాన్ని నొక్కండి.
  • దీని తరువాత, కామెంట్ నిర్వహించు ఎంచుకోండి.
  • మీరు తొలగించాలనుకుంటున్న కామెంట్స్ ను ఎంచుకోండి. మీరు ఒకేసారి 25 కామెంట్స్ ను ఎంచుకోవచ్చు.
  • మరిన్ని ఎంపిక కు వెళ్లడం ద్వారా బ్లాక్ చేయండి లేదా రిపోర్ట్ చేయవచ్చు.
  • ఈ విధంగా మీరు నెగటివ్ కామెంట్స్ ను తీసివేయవచ్చు మరియు సానుకూల కామెంట్స్ ను కూడా హైలైట్ చేయవచ్చు. త్వరలో యాప్ లో ఇంగోట్ కామెంట్స్ పైన టెస్ట్ కూడా ప్రారంభమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo