మీ ఫోనులో ఫోటో మరియు వీడియోలు డిలీట్ అయితే ఎలా? ఈ Apps ఉంటే చాలు.

Updated on 08-Apr-2019
HIGHLIGHTS

ఈ App దాదాపుగా 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది.

మీరు Google Play Store లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది.

అనుకోకుండానే ఒక్కొక్కసారి ఫోటో లేదా వీడియోలను డిలీట్ చేస్తాం.

మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి ఏదైనా ఫోటోను అనుకోకుండా డిలీట్ చేసారా? అయినా సరే కంగారు పడాల్సిన వసరం లేదు. అనుకోకుండా ఒక్కొక్కసారి ఫోటోలను తొలగించండం అనేది అప్పుడప్పుడు ఒక్కరికి ఎదురయ్యే సాధారణ సమస్యే అవుంతుంది. అటువంటి సమయంలో మీకు ఉత్తమ సహాయాన్ని అందించే 3 Apps గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు సహాయపడే ఈ Apps పేర్లు మరియు ఫీచర్లను ఈ క్రింద తెలుసుకోండి.

DiskDigger Photo Recovery

ఈ App దాదాపుగా 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అలాగే, ఇది Google Play స్టోర్లో 4.2 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 2 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు ఈ App యొక్క పరిమాణం మీ పరికరాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆప్ తో, డిలీట్ అయిన ఫోటోలను మళ్ళీ ఫోటోలను అన్ డిలేట్ మరియు రికవరీ చేస్తుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ చాలా సులభం. ఇది ఉపయోగించడానికి సులభం.ఎటువంటి రూట్ చేయాల్సిన పనిలేదు.

Deleted Photo Recovery

మీరు Google Play Store లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్, 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్లో 4.3 స్టార్స్ కలిగివుంది. ఇది 66,000 వినియోగదారులచే రేట్ చేయబడింది. ఈ అప్లికేషన్ చాలా ఫోటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది.మీ ఫోనులో లేదా మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫోటోలను, త్వరగా తిరిగి తీసుకొస్తుంది.

Restore Image (Super Easy)

ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారులచేత  డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా, Google Play Store లో 4.0 స్టార్లను సొంతంచేసుకుంది. ఇది 65,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 3MB గా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్ను root చేయాల్సిన అవసరం లేదు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :