కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిధారులకు శుభవార్త…!

కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిధారులకు శుభవార్త…!
HIGHLIGHTS

రేషన్ కార్డు లబ్ధిధారులకు గుడ్ న్యూస్

దేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు

ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి

దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిధారుల కోసం ఈ కొత్త APP ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. మేరా రేషన్ యాప్ పేరుతో వచ్చిన ఈ యాప్ రేషన్ కార్డు లబ్ధిదారులకు వరంలా మారుతుంది.

రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది.

మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.     

 మేరా రేషన్ మొబైల్ యాప్

ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo