హ్యాపీ న్యూ ఇయర్ 2021: Whatsapp నుండి సరికొత్త తరహాలో New Year శుభాకంక్షాలు పంపండి.

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 31 Dec 2020
HIGHLIGHTS
  • హ్యాపీ న్యూ ఇయర్ 2021కోసం కొత్త స్టికర్లు

  • కొత్త తరహాలో New Year శుభాకంక్షాలు పంపండి

  • 2021 విషెస్ కోసం Whatsapp కొత్త స్టిక్కర్లు

హ్యాపీ న్యూ ఇయర్ 2021: Whatsapp నుండి సరికొత్త తరహాలో New Year శుభాకంక్షాలు పంపండి.
హ్యాపీ న్యూ ఇయర్ 2021: Whatsapp నుండి సరికొత్త తరహాలో New Year శుభాకంక్షాలు పంపండి.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి మీకు ఇష్టమైన వారికీ లేదా మీ కుటుంభం సభ్యులకు లేదా మీ స్నేహితులు మరియు మీకు కావాల్సిన వారందరికీ ఈ కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని మీరు పంపించే ఒక్క మెసేజి వారిని మీ గురించి వారిని తలచుకుని మరియు గుర్తుంచుకునేలా చేస్తుంది. అయితే, ఇప్పటికే అందరూ వాడుతున్న పాత టైపింగ్ లేదా ఫార్వార్డ్ మెసేజిలతో కాకుండా కొత్తగా మీ శుభాకంక్షాలు తెలపండి.

2021 విషెస్ కోసం Whatsapp కొత్త స్టిక్కర్లను మరియు కొత్త స్టిక్కర్లను అందించింది. అంటే, ఇప్పుడు మీరు Whatsapp Happy New Year స్టిక్కర్లతో మీ న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియచేయవచ్చు. ఇందుకోసం, మీరు మీ వాట్సా అప్ లో ఈ కొత్త స్టిక్కర్లను జోడించవలసి ఉంటుంది.

 మీ  Whatsapp లో కొత్త స్టిక్కర్లను జోడించడానికి, మీరు ఎవరికైతే 2021 న్యూ ఇయర్ శుభాకాంక్షలను  పంపించాలనుకుంటారో వారి  చాట్  లోకి వెళ్లి క్రింద ఎడమ వైపున వున్న ఎమోజిని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు దిగువన ఎమోజి, GIF మరియు స్టికర్ ఎంపికలు కనిపిస్తాయి. వీటిలో, స్టికర్ యంఎపికను ఎంచుకోండి.

స్టికర్ విబామాలోకి వచ్చిన తరువాత కుడివైపున పైన ప్లస్ గుర్తు కనిపిస్తుంది. దానికి పైన నొక్కిన వెంటనే All Strikers మరియు My Strikers ఎంపికలు కనిపిస్తాయి. వీటిలో All Strikers అప్షన్ ఎంచుకొని ఇక్కడ నుండి హ్యాపీ న్యూ ఇయర్ 2021 కి సంభందించిన కొత్త స్టిక్కర్లను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఎవరికి పంపవచ్చు.

ఒక వేళా మీకు నచ్చినట్లుగా మరిన్ని కొత్త స్టిక్కర్లను కోరుకుంటే మాత్రం All Strikers విభాగంలోనే అన్నింటి కంటే క్రింద Get More Stickers అనే ఆప్షన్ ద్వారా మరిన్ని స్టిక్కర్లను క్రియేట్ చెయ్యడానికి ఉపయోగపడే Apps ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

logo
Raja Pullagura

email

Web Title: how to get happy new year 2021 latest stickers gif and more on whatsapp
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status