కొత్త రకం జోకర్ మాల్వేర్ తో నిండిన 11 యాప్స్ తొలిగించిన గూగుల్ : మీ ఫోనులో ఈ యాప్స్ ఉంటే వెంటనే తీసెయ్యండి

కొత్త రకం జోకర్ మాల్వేర్ తో నిండిన 11 యాప్స్ తొలిగించిన గూగుల్ : మీ ఫోనులో ఈ యాప్స్ ఉంటే వెంటనే తీసెయ్యండి
HIGHLIGHTS

ప్రజలు తమకు తెలియకుండానే ప్రీమియం సర్వీస్ కు సభ్యత్వానికి డబ్బుచెల్లించడానికి సులువైన మార్గంగా, హ్యాకర్లు ఈ కొత్త మార్గాన్ని కనుగొన్నారు.

ఈ యాప్స్ ద్వారా వెళ్ళే కొత్త మార్గం ద్వారా హ్యాకర్లు Google Play యొక్క సెక్యూరిటీని కూడా దాటవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ నుండి 11 యాప్స్ ని తొలగించింది. ఈ తొలగించబడిన యాప్స్ ప్రమాదకరమైన జోకర్ మాల్వేర్ బారిన పడ్డాయి. గూగుల్, యాప్స్ పైన జోకర్ మాల్వేర్ ప్రభావాన్ని  2017 నుండి ట్రాక్ చేస్తోంది. అయితే,  ఈ యాప్స్ లో జోకర్ మాల్వేర్ యొక్క కొత్త రకాన్ని చెక్‌పాయింట్ రీసెర్చర్లు కనుగొన్నారు. ప్రజలు తమకు తెలియకుండానే ప్రీమియం సర్వీస్ కు సభ్యత్వానికి డబ్బుచెల్లించడానికి సులువైన మార్గంగా, హ్యాకర్లు ఈ కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈ యాప్స్ ద్వారా వెళ్ళే కొత్త మార్గం ద్వారా హ్యాకర్లు Google Play యొక్క సెక్యూరిటీని కూడా దాటవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించబడిన 11 యాప్స్

ప్లే స్టోర్‌లోని ఈ 11 యాప్స్ లో జోకర్ మాల్వేర్ కనుగొనబడింది. వెంటనే, గూగుల్ ఈ యాప్‌లన్నింటినీ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు చెక్ పాయింట్ తెలిపింది. మీ Android ఫోన్‌లో ఈ యాప్స్ ఏవైనా ఉంటే, వెంటనే వాటిని తొలగించండి. ఈ జాబితాలో వున్న 11 యాప్స్ ఈ క్రింద చూడవచ్చు…

com.imagecompress.android

com.contact.withme.texts

com.hmvoice.friendsms

com.relax.relaxation.androidsms

com.cheery.message.sendsms (two different instances)

com.peason.lovinglovemessage

com.file.recovefiles

com.LPlocker.lockapps

com.remindme.alram

com.training.memorygame

గూగుల్ ప్లే యొక్క సెక్యూరిటీ ఫీచర్లు చాలా ఉన్నప్పటికీ, జోకర్ మాల్వేర్ ని గుర్తించడం చాలా కష్టం అని చెక్ పాయింట్, ప్రత్యేకంగా తెలిపింది. అందుకు ఉదాహరణగా, ఇది చాలా తెలివిగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి తిరిగి రావడం గురించి చెప్పింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్లే స్టోర్‌లోని 1,700 హానికరమైన "బ్రెడ్" యాప్స్ ని గుర్తించి తొలగించినట్లు, గూగుల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ బ్రెడ్ యాప్స్ అని కూడా జోకర్ మాల్వేర్‌తో ఉన్నాయి.

వినియోగదారులు డౌన్‌లోడ్ చేయడానికి ముందే ఈ యాప్‌లను తొలగించారని గూగుల్ తెలిపింది. గూగుల్ 2017 నుండి జోకర్ మాల్వేర్ను ట్రాక్ చేస్తోంది.

Via

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo