ఆండ్రాయిడ్ బెస్ట్ 5 బైక్ రేసింగ్ గేమ్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Nov 2018
HIGHLIGHTS
  • ఈ బైక్ గేమ్స్ మంచి గేమింగ్ అనుభూతిస్తాయి.

ఆండ్రాయిడ్ బెస్ట్ 5 బైక్ రేసింగ్ గేమ్స్

ప్రారంభంనుండి గేమ్ ముగిసేవరకు ఉత్కంఠతనురేపే బైక్ గేమ్ ఆడాలనుకుంటారు చాలామంది. అలాంటివారికోసం, గూగుల్ ప్లే స్టోర్లో వున్న బెస్ట్ 5 బైక్ రేసింగ్ గేములు గురించి ఇప్పుడు తెలియచేయబోతున్నాము. ఇక్కడ అందించిన ఈ గేమ్స్ మంచి గ్రాఫిక్స్ మరియు గొప్ప అనుభూతినిస్తాయి ఆండ్రాయిడ్ వినియోగదారులకి.   

1. SBK 16 Official Mobile Game

సూపర్ బైక్  వరల్డ్ ఛాంపియన్షిప్  యొక్క అధికారిక గేమ్, ఈ SBK 16  చాల రకాలైన కంట్రోలింగ్ పద్దతులతో మీకు మంచి బైక్ రేసింగ్ అనుభూతినిస్తుంది. రియల్ వరల్డ్ క్యారెక్టర్లతో మరియు చాల ఎక్కువ రేసింగ్ ట్రాక్లతో వస్తుంది ఈ గేమ్. దీని యొక్క గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి మరియు దీని యొక్క గేమ్ ప్లే గొప్పగా ఉంటుంది.  

2. Traffic Rider

ట్రాఫిక్ రేసర్ క్యారెక్టర్ల నుండి వచ్చిన మరొక ఆడెక్టివ్ గేమ్ ఈ ట్రాఫిక్ రైడర్. ముందు వచ్చిన టైటిల్ లాగ కాకుండా, బెటర్ గ్రాఫిక్స్ మరియు ఒక సరికొత్త కెరీర్ తో వస్తుంది ఈ గేమ్. కాబట్టి, అనంతమైన హైవెల పైన ప్రయాణిస్తూ మీ మిషన్ పూర్తి చేయడం ద్వారా కొత్త బైకులకు అప్గ్రేడ్ అవ్వవచ్చు.

3. Gravity Rider

బైక్ రేసింగ్ గేమ్ లో ఛాలెంజ్ కోరుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ గేమ్ మోటో జంప్స్, మెగా రాంప్స్, ఆస్పాల్ట్ ఎలివేటర్లు మెలికలు తిరిగిన  మరియు డ్రిఫ్ట్ ట్రాక్స్ మీకు ఛాలంజ్ చేస్తాయి. మీ అద్భుతమైన ఆటతీరుతో లెజండరీ కారు బాగాలను పొందవచ్చు.

4. Crazy Bike Attacks Racing New : Motorcycle Racing

రోడ్ రాష్ గేమ్ లాంటి అనుభూతిని మీ ఆంధ్రోడి మొబైల్లో పొందాలనుకుంటున్నారా? అయితే, ఈ క్రేజీ బైక్ అట్టాక్స్ గేమ్ మీరు కోరుకునే ఒక గేమ్ కావచ్చు. ఈ గేములో, మీరు స్పోర్ట్స్ బైక్ నడుపుతూనే మీ ప్రత్యర్ధిపైన కొట్టడం లేదా కాలితో కిక్స్ ఇస్తూ దాడి చేయాల్సివుంటుంది.        

5. Beach buggy Blitz

ఈ బీచ్ బగ్గి బ్లిట్జ్ గేమ్  మీ మొబైల్ ఫోనులో వర్చువల్ ప్రపంచంలో నుండి  ఒక డైనమిక్ మరియు విధ్వంసక రియాలిటీలోకి తీసుకొస్తుంది. మీ హాట్ రాడ్ బగ్గి ని రహస్య గుహలు మరియు పురాతన దేవాలయాల మద్య తీసుకుపోవచ్చు. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
best racing games bike racing games racing games
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status