5 బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటింగ్ ఆప్స్

5 బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటింగ్ ఆప్స్
HIGHLIGHTS

మొబైల్ ఫోన్లను అన్నిచోట్లకు తీసుకెళతాము కాబట్టి, PC మాస్టర్ తో అవసరంలేకుండా మీరు తీసిన వీడియోలను మొబైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఆప్లతో.

ల్యాప్ టాప్ లేదా PC అవసరంలేకుండానే ఒక సాధారణ వీడియో ఎడిటింగ్ మీ మొబైల్ ఫోన్లలో చేసుకోవచ్చు. అయితే, వీడియోలను సరియన పద్దతిలో ఎడిట్ చేయగల App లను గురించి తెలుసుకోవడం లేదా ఎంచుకోవడం చాల కష్టమైన పనిగా ఉంటుంది. అలాగే, కొన్ని App లు గొప్ప ఎడింగ్ సామర్ధాయాన్ని కలిగి వున్నా కూడా వాటిని నిర్వహించడం చాల తికమకగా ఉంటుంది. మరికొన్ని App లను సులభంగా వాడే విధంగా వున్నా అవి మంచి ఎడింగ్ ని అంధించలేవు. కాబట్టి,  ఇటువంటి సమస్య ఎదురవకుండా 5 బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటింగ్ App జాబితాను అందిస్తున్నాము చూడండి.

Adobe Premiere Clip 

ఫోన్లలో వీడియోలను ఎడిట్ చేయడానికి, అడోబ్ ఒక చక్కని పరిష్కారం మరియు అలా చేయడానికి సాధారణ టూల్స్ శ్రేణిని అందిస్తుంది. సౌండ్ ట్రాక్ ఎంచుకుని  చిత్రాలను జోడించడం లేదా గ్రౌండ్ నుండి వీడియోను సవరించడం ద్వారా స్వతహాగా వీడియోలను సృష్టించవచ్చు. ఎంచుకోవడానికి అడ్జెస్టుమెంట్, పరివర్తనాలు మరియు ఎఫెక్ట్స్ యొక్క పరిధి ఉంది. ఏదేమైనా, ఒక వీడియోను మరింత మెరుగు పరచడానికి Adobe Premiere Pro CC లో ఎగుమతి చేయబడిన క్లిప్ను సులభంగా తెరవడానికి సామర్ధ్యం కలిగి ఉంటుంది,మా అభిప్రాయంలో ఇది అత్యుత్తమమైనది.

KineMaster Pro

మొబైల్ పరికరాల్లో అందుబాటులో ఉన్న శక్తివంతమైన వీడియో ఎడిటింగ్ ఆప్స్ లో  KineMaster ప్రో ఒకటి. అయితే, దాని పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి, వినియోగదారులు కొంత డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్,  మల్టిపుల్ లేయర్ చిత్రాలు, వీడియో మరియు టెక్స్ట్ లకు మద్దతు ఇస్తుంది. దీనితో పాటుగా, బేసిక్  కట్టింగ్ మరియు వీడియోలను కత్తిరించడంతో పాటు, మల్టీ-ట్రాక్ ఆడియో, కలర్ LUT ఫిల్టర్లు, 3D పరివర్తనాలు మరియు మరెన్నో దీనితో చేయవచ్చు.

FilmoraGo

ఫిల్మోరాగో విషయానికి వస్తే, ఇది చాలా తక్కువ మందికి తెలిసిన వీడియో ఎడిటింగ్ ఆప్. ఇది యూట్యూబ్ కోసం 16: 9 మరియు  ఇన్స్టాగ్రామ్ వీడియోల కోసం 1: 1 చదరపు ఆకృతిలో, వీడియోలను సవరించడం కోసం కట్, ట్రిమ్ మరియు రెండర్ వంటి కొన్ని ప్రాథమిక లక్షణాలను అదనపు ఎంపికలతో అందిస్తుంది. పరివర్తనాలు, విస్తరణలు, మ్యూజిక్  మరియు మరిన్ని జోడించడం కోసం కూడా ఇది మద్దతునిస్తుంది. ఈ ఆప్ ను కొనుగోలుతో కానీ ఉచిత సంస్కరణతో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగుమతి చేయబడిన వీడియోల్లో వాటర్మార్క్ లేదా సమయ పరిమితి లేదు మరియు చాలా ఫీచర్లు ఉచితంగానే ఉంటాయి.

VivaVideo

వీడియో ఎడిటింగ్ అనువర్తనాల్లో వివావీడియో వర్గీకరణ చేయబడినప్పటికీ, ఇమేజ్ సవరణతో మరియు అన్ని ఆటోమేటెడ్ ఎడిటింగ్ అప్షన్లు ఎక్కువ. సోషల్ మీడియా వేదికల కోసం చిన్న వీడియోలను ఎడిట్ చేయడానికి  ఇది మంచిది మరియు వినియోగదారులు స్టోరీబోర్డు శైలిలో క్లిప్లను లోడ్ చేయడానికి ఇది దోహదపడుతుంది. అంటే దీని అర్ధం, ఒక దిగుమతి చేయబడిన క్లిప్ తో పనిచేయడం మరియు దానిని సవరించడం, తరువాత టాస్క్ కి మారడం. ఇందులో వీడియో యొక్క ఫిల్టర్లు, ప్రభావాలు, టెక్స్ట్ యాడింగ్ మరియు వీడియో యొక్క ట్వీకింగ్ స్పీడ్ వంటి అనేక అదనపు లక్షణాలు ఉన్నాయి. దీని ఉచిత ఆప్,   వాటర్మార్క్ ను  జోడించి, సవరించిన వీడియోలకు సమయ పరిమితిని విదిస్తుంది, కాని ఈ ఆప్లో అనుకూల లక్షణాల కోసం నగదు చెల్లించి, అన్లాక్ చేయడానికి ఒక ఎంపిక ఉంది.

Quick

పనిచేయడానికి ఒక సంక్లిష్ట వీడియో ఎడిటింగ్ ఆప్ అవసరం లేదు అనుకుంటే . క్విక్ అనేది ఒక సాధారణ పరిష్కారం, ఇది ఒక వినియోగదారుని కొన్ని చిత్రాలు మరియు వీడియోలను దిగుమతి చేసుకోవడానికి మరియు దాని నుండి వీడియోను సృష్టించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆప్ స్వయంచాలకంగా నేపథ్య సంగీతానికి పరివర్తన మరియు ఎఫెక్టులను జోడిస్తుంది, ఇప్పటికే  ఇది అందుబాటులో ఉన్న100 కంటే ఎక్కువ  ఉచిత ట్రాక్ల నుండి దిగుమతి చేసుకోవచ్చు లేదా ఎంచుకోవచ్చు. GoPro అనువర్తనాల డెవలపర్గా, దాని అసలు ఉద్దేశం అనుకూల GoPro పరికరం నుండి డేటాను లాగడం మరియు వాటిని తక్షణమే ఒక వీడియోను సృష్టించడం. అయితే, ఫార్ములా కూడా వీడియో ఎడిటింగ్ తో బాగా ప్రావీణ్యం లేని వ్యక్తి కోసం బాగా పనిచేస్తుంది మరియు ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం కూడా కేటాయించవల్సిన అవసరంకూడాలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo