12 నెలలు ఫ్రీ ఇంటర్నెట్ అండ్ లాలిపాప్ os తో 4,444 రూ లకు టాబ్లెట్ లాంచ్

12 నెలలు ఫ్రీ ఇంటర్నెట్ అండ్ లాలిపాప్ os తో 4,444 రూ లకు టాబ్లెట్ లాంచ్

Datawind కొత్త వాయిస్ కాలింగ్ టాబ్లెట్ ను రిలీజ్ చేసింది ఇండియాలో. దీని పేరు Ubislate i3G7. ప్రైస్ - 4,444 రూ. కాని అసలు ధర 5,999 అని చెబుతుంది కంపెని.

దీనిలో ఉన్న ప్రధనమైన హై లైట్ ఏంటంటే 12 నెలలు కంపెని రిలయన్స్ నెట్ వర్క్ సిమ్ వాడే వారికి ఫ్రీ ఇంటర్నెట్ ను ఇవనుంది. అయితే ఫ్రీ ఇంటర్నెట్ లో ఆడియో, వీడియో స్ట్రీమింగ్ అండ్ డౌన్లోడ్స్ పనిచేయవి. జస్ట్ బ్రౌజింగ్.

మరొక విశేషము ఏంటంటే టాబ్లెట్ లో ఇంటెల్ ప్రాసెసర్ ఉంది. ఇంటెల్ 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్ అండ్ 1GB ర్యామ్ ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ తో రావటం మరొక విశేషం.

ఇది 7 in TFT 1024x600 పిక్సెల్ రిసల్యుషణ్ డిస్ప్లే, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, 2MP రేర్ కెమెరా అండ్ 0.3MP ఫ్రంట్ కెమెరా, 3G ఇంటర్నెట్..

ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os పై రన్ అవటం కూడా ప్రైస్ తో కంపేర్ చేస్తే మంచి విషయమే. 2800 mah బ్యాటరీ, WiFi, వాయిస్ కాలింగ్ సపోర్ట్ తో 278 గ్రా బరువు కలిగి ఉంది. 

టాబ్లెట్ కేవలం బ్లాక్ కలర్ లోనే వస్తుంది. ఫ్రీ ఇంటర్నెట్ కొరకు టాబ్లెట్ కొన్నాక, మీరు రిలయన్స్ సిమ్ వేసి UbiSurfer Internet Browser యాప్ ను ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి.

PJ Hari

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile