భారీ ఆఫర్లతో ఆదివారం నుండి మొదలవనున్నఅమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా అదే తేదీకి మొదలవుతుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 ను సెప్టెంబర్ 29 అంటే ఈ ఆదివారం నుండి ప్రారంభిస్తోంది మరియు ఈ సేల్ నుండి చాలా గొప్ప ఆఫర్లను ఇవ్వబోతోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2019 సెప్టెంబర్ 28 వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక సేల్ అక్టోబర్ 4 తో ముగుస్తుంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా అదే తేదీకి మొదలవుతుంది.
Surveyఈ విధంగా ఈ రెండు ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫారాలు కూడా పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ 2019 అమ్మకం కూడా సెప్టెంబర్ 29 న జరుగుతుంది మరియు అక్టోబర్ 4 వరకు నడుస్తుంది. అమెజాన్ ఈ అమ్మకం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యంగా నడవనుంది. SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనేవారికి 10% తక్షణ తగ్గింపు ఉంటుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సెల్‌లో కొన్ని ఉత్పత్తులు ఇప్పటివరకు ఎన్నడూ చూడనటువంటి చౌక ధరకు లభిస్తాయి.
ఈసేల్ సమయంలో స్మార్ట్ ఫోన్ల పైన 40% తగ్గింపు ఉండగా, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు 99 రూపాయల ప్రారంభ ధరకు అమ్మనున్నట్లు కూడా చెబుతోంది. గృహోపకరణాలను 75% వరకు తగ్గింపుతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ యొక్క టీజర్ పేజీ ప్రకారం, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు వడ్డీయేతర EMI ఎంపిక కూడా ఉంటుంది. అమ్మకం సమయంలో, అమెజాన్ అనేక అగ్ర బ్రాండ్ ఉత్పత్తులను కూడా విడుదల చేస్తుంది. సరికొత్తగా విడుదల చేసిన వన్‌ప్లస్ టీవీ కూడా ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
