మీ Smart TV మీ డేటా ట్రాక్ చేస్తుంది .. ట్రాక్ చేయకుండా ఇలా చేయండి.!
ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా గొప్పగా చెప్పుకునే వారు
టెక్నాలజీ తో Smart TV ప్రతి ఇంట్లో పాతుకు పోయింది
స్మార్ట్ టీవీ చాలా స్మార్ట్ గా మిమ్మల్ని మరియు మీ డేటాని ట్రాక్ చేస్తుంది
ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా గొప్పగా చెప్పుకునే వారు. అయితే, కాలక్రమేణా మారిన కాలం మరియు టెక్నాలజీ తో Smart TV ప్రతి ఇంట్లో పాతుకుపోయింది. ఈ టీవీలు ఇంటర్నెట్ తో నేరుగా పనిచేసే శక్తిని కలిగి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి OTT చాలా యాప్స్ మరియు యూట్యూబ్ తో పాటు వాయిస్ అసిస్టెంట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో స్మార్ట్ టీవీలు చాలా స్మార్ట్ గా మారాయి. అయితే, ఇదే స్మార్ట్ టీవీ చాలా స్మార్ట్ గా మిమ్మల్ని మరియు మీ డేటాని ట్రాక్ చేస్తుంది. అంటే, మీరు చూసే కంటెంట్ అభిరుచి, సెర్చ్ హిస్టరీ మరియు వాయిస్ కమాండ్స్ వంటి డీప్ పర్సనల్ డేటా ను సేకరించే చేసే అవకాశం స్మార్ట్ టీవీ లో ఉంది. మీ స్మార్ట్ టీవీ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా ఎలా చేయాలో ఈరోజు తెలుసుకోండి.
SurveySmart TV ట్రాక్ చేసే వివరాలు ఏమిటి?
మీరు మీ స్మార్ట్ టీవీ లో చూసే సినిమాలు మరియు ఎంతసేపు మీరు టీవీ చూస్తున్నారు, అనే వివరాలతో పాటు మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్స్ డీటెయిల్స్ కూడా సేకరిస్తుంది. ఇది మాత్రమే కాదు వాయిస్ సెర్చ్ లో మీరు మాట్లాడే వివరాలు కూడా టీవీ కంపెనీ తో పాటు అడ్వార్టైజర్లు కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంది.
డేటా ఎలా ట్రాక్ చేస్తుంది?
స్మార్ట్ టీవీ లలో ACR (ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నైజేషన్) అనే ఒక టెక్నాలజీ బిల్ట్ ఇన్ గా ఉంటుంది. ఇది మీరు చూసే కంటెంట్ ను గుర్తిస్తుంది. దీని ద్వారా మీరు చూసే వ్యూవింగ్ ప్యాట్రన్ ను అనలైజ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ డేటాతో మీకు నచ్చే యాడ్స్ టీవీ లో చూపించడానికి ఉపయోగిస్తుంది. అంతేకాదు, కొన్ని స్మార్ట్ టీవీలు మైక్రోఫోన్ ద్వారా వాయిస్ డేటా మరియు ఇంటర్నెట్ యూసేజ్ తో యాప్స్ యాక్టివిటీ సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉంది.
Smart TV డేటా ట్రాక్ తో సమస్య ఏమిటి?
స్మార్ట్ టీవీ మీ డేటా మరియు మిమ్మల్ని అనుక్షణం ట్రాక్ చేస్తే మీ ప్రైవసీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు చూసే కంటెంట్ తో మిమ్మల్ని టార్గెట్ చేసే యాప్స్ పెరుగుతాయి. అంతేకాదు, మీ పర్సనల్ టీవీ వ్యూవింగ్ బిహేవియర్ కూడా కంపెనీ వద్ద స్టోర్ అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, హ్యాక్డ్ స్మార్ట్ డివైజెస్ ద్వారా స్మార్ట్ టీవీ లకు సైబర్ రిస్క్ కూడా ఉండొచ్చు.

డేటా ట్రాకింగ్ ఎలా ఆపాలి?
డేటా ట్రాకింగ్ ఆపడానికి మీ స్మార్ట్ టీవీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ACR ఫీచర్ ను ఆఫ్ చేయాలి. ఇదే విషయాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పాలంటే, ముందుగా టీవీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోండి. ఇందులో యూజర్ అగ్రిమెంట్ లో ఉన్న వ్యూవింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ను ఎంచుకోండి. ఈ ఆప్షన్ లో ACR ట్యాబ్ ఉంటుంది మరియు ఈ ట్యాబ్ ను ఆఫ్ చేయండి.
Also Read: 8000 mAh భారీ బ్యాటరీ ఫోన్ Realme 16T 5G పై భారీ ఆఫర్స్ అందుకోండి.!
ఇక్క మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, టీవీ బ్రాండ్ ను బట్టి ఫీచర్ ఈ పేరు మారే అవకాశం ఉంటుంది. బ్రాండ్ మరియు ఆ స్మార్ట్ టీవిలో ఉండే ఈ సెట్టింగ్ పేరు ఈ క్రింద అందించాము.
- Samsung – వ్యూవింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
- LG – లైవ్ ప్లస్
- Sony – Samba Interactive TV
- TCL – Smart TV Experience
వాయిస్ కంట్రోల్ ఎలా ఆపాలి?
వాయిస్ కంట్రోల్ ఎలా ఆపాలి అని చూస్తే, మీరు మీ స్మార్ట్ టీవిలో ఉన్న వాయిస్ కంట్రోల్ ఫీచర్ ను ఉపయోగించకపోతే ఆ ఫీచర్ ను ఆఫ్ చేయడం చాలా మంచిది. మీ స్మార్ట్ టీవీ లో ఉండే అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ మరియు టీవీ మైక్రోఫోన్ లకు యాక్సెస్ ను నిలిపివేయండి. ఈ విధంగా చేస్తే మీ స్మార్ట్ టీవీ మీ డేటా ని ట్రాక్ చేయకుండా నిలువరించే అవకాశం ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
