మీ Smartphone లో ఉండే Apps నుంచి మీ వ్యక్తిగత డేటాను ఎలా రక్షించుకోవాలి?
ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది
మీ ఫోన్ లో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రైవసీ ప్రమాదంలో పడుతుంది
Smartphone లో ఉండే Apps నుంచి మీ వ్యక్తిగత డేటాను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. . మన స్మార్ట్ ఫోన్ లో మనం రోజూ ఉపయోగించే యాప్ లు మన పర్సనల్ డేటా, అంటే కాంటాక్ట్స్, ఫోటోలు, ఫోన్ లొకేషన్ మరియు మెసేజ్ వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ ఫోన్ లో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రైవసీ ప్రమాదంలో పడుతుంది. అందుకే, మీ Smartphone లో ఉండే Apps నుంచి మీ వ్యక్తిగత డేటాను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.
SurveyApps నుంచి మీ Smartphone డేటా ఎలా రక్షించుకోవాలి?
మీరు మీ స్మార్ట్ ఫోన్ లో చేసే చిన్న చిన్న మార్పుల ద్వారా మీ ఫోన్లో ఉన్న యాప్స్ నుంచి మీ పర్సనల్ డేటాని రక్షించుకునే అవకాశం ఉంటుంది. దీనికి తగిన లేదా అవసరమైన పది ఉత్తమ మార్గాలు ఈరోజు అందిస్తున్నాము.
మీ ఫోన్ యాప్ పర్మిషన్ కంట్రోల్ చేయండి
ఎందుకంటే ముఖ్యమైనది మరియు మొదటి అవకాశం మీ ఫోన్ లో ఉన్న యాప్ పర్మిషన్ కంట్రోల్ చేయడం. ఆండ్రాయిడ్ లేదా iOS లో కూడా ఉండే ప్రతి యాప్ కు పర్మిషన్ పరిమితి ఉంటుంది. కాబట్టి, యాప్ ను బట్టి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి. అంటే, మీ ఫోన్ లో బ్యాటరీ యాప్ ఉంటే దానికి లొకేషన్ లేదా కెమెరాతో పని ఉండదు. కాబట్టి, వాటికి పర్మిషన్ అవసరం ఉండదు.
ఏదైనా యాప్ కి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే, “Allow only while using the app” ఆప్షన్ వాడండి. ఇది కేవలం మీరు యాప్ ను ఉపయోగించే సమయంలో మాత్రమే మీ వివరాలు యాక్సెస్ చేయగలుగుతుంది.
స్ట్రాంగ్ పాస్వర్డ్ మరియు అథెంటికేషన్ వాడండి
సాధారణంగా చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లు అన్ని ప్రతి యాప్ కు ఒకే పాస్వర్డ్ ఉపయోగిస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి యాప్ పాస్వర్డ్ ను మార్చి పెట్టడం మంచిది. అలాగే, లెటర్, నెంబర్ మరియు సింబల్స్ వాడితే పాస్వర్డ్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. 2-Factor Authentication (2FA) తప్పనిసరిగా ఎనేబుల్ చేయండి. ఇలా చేస్తే హ్యాకింగ్ రిస్క్ ను చాలా వరకు తగ్గిస్తుంది.

గుర్తు తెలియని యాప్స్ డౌన్లోడ్ చేయకండి
కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్ లు ఇన్‌స్టాల్ చేయండి. గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చే APK ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్‌స్టాల్ చేయకండి.
Also Read: Tecno Pop X 5G: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile