SIR Status Online ఎలా చెక్ చేయాలి: పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్

HIGHLIGHTS

మీరు ఎలక్షన్ SIR ప్రక్రియలో ఫారం సమర్పించి ఉంటే ఈజీగా స్టేటస్ తెలుసుకోవచ్చు

ఈ గైడ్‌ లో SIR Status Online ఎలా చెక్ చేయాలో సవివరంగా తెలుసుకోవచ్చు

మీ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ పై మీ అప్లికేషన్‌ కు సంబంధించిన లేటెస్ట్ స్టేటస్ కనిపిస్తుంది

మీరు ఎలక్షన్ SIR (Special Intensive Revision) ప్రక్రియలో ఫారం సమర్పించి ఉంటే, అది విజయవంతంగా నమోదు అయిందా లేదా ప్రస్తుతం ఏ దశలో ఉందో లేక ఆమోదించబడిందా లేదా ఇంకా పరిశీలనలో ఉందా, అనే వివరాలను మీరు ఆన్‌ లైన్‌ లో సులభంగా తెలుసుకోవచ్చు. ఈరోజు అందించిన ఈ గైడ్‌ లో SIR Status Online ఎలా చెక్ చేయాలో సవివరంగా తెలుసుకుందాం.

SIR Status Online

ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ తెలుసుకోవడానికి మీరు Acknowledgement / Reference Number లేదా ఫారం సమర్పించినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా EPIC (ఓటరు ఐడి) నెంబర్ ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. ఈ వివరాలు మీరు దగ్గర పెట్టుకున్న తర్వాత స్టేటస్ ను చెక్ చేయడానికి ఉపక్రమించండి.

SIR Status Online : స్టెప్ బై స్టెప్

ముందుగా భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) లేదా మీ రాష్ట్ర ఎన్నికల అధికారిక వెబ్‌ సైట్‌ ను ఓపెన్ చేయండి. ఇక్కడ హోమ్‌పేజీలో కనిపించే ట్రాక్ అప్లికేషన్, అప్లికేషన్ స్టేటస్ లేదా SIR ఫామ్ స్టేటస్ అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయండి. ఇక్కడ సూచించిన వద్ద అవసరమైన వివరాలు నమోదు చేయండి. అంటే, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ లేదా రిఫరెన్స్ నెంబర్ మరియు అవసరమైతే కాప్చ Code నమోదు చేయండి. మీరు అందించిన అన్ని వివరాలు సరిచూసుకుని Submit లేదా Track Status బటన్‌ పై క్లిక్ చేయండి.

ఇలా చేస్తే మీ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ పై మీ అప్లికేషన్‌ కు సంబంధించిన లేటెస్ట్ స్టేటస్ స్థితి కనిపిస్తుంది.

  • Submitted
  • Under Verification
  • BLO Verification Pending
  • Accepted
  • Approved
  • Rejected
  • Correction Required

అనే స్టేటస్‌ లలో ఏదో ఒకటి మీ ఫామ్ కోసం వివరణగా కనిపిస్తుంది. ఈ స్టేటస్ లో ప్రతిదానికి ఒక అర్థం వుంది. అవి కూడా ఇప్పుడు వివరంగా చూద్దాం.

మీ స్టేటస్ సబ్‌మిట్ అని వస్తే మీ దరఖాస్తు విజయవంతంగా సమర్పించబడిందని అర్థం. ఒకవేళ మీ ఫామ్ స్టేటస్ లో BLO వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తే మీ దరఖాస్తును ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారని అర్థం. అదే “Approved” అని వస్తే మీ దరఖాస్తు ఆమోదించబడిందని కన్ఫర్మ్ అవుతుంది. మీ ఫామ్ స్టేటస్ లో “Rejected” అని వస్తే మీ దరఖాస్తు తిరస్కరించబడిందని చెప్పినట్లు మరియు దానికి తగిన కారణాలు పరిశీలించండి. పెయిన్ తెలిపిన కారణాలు కాకుండా “Correction Required” అని వస్తే మాత్రం మీరు అందించిన వివరాలు లేదా పత్రాల్లో సవరణలు అవసరం అని చెప్పినట్లు. కాబట్టి, ఇక్కడ సూచించే మార్పులు చేసి మళ్లీ సమర్పించాలి.

మీరు చెప్పిన వివరణ బాగానే ఉంది. కానీ, అసలు ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ అసలు కనిపించకపోతే ఏమి చేయాలి? అని మీకు డౌట్ రావచ్చు. ఇకవేళ మీ ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ కనిపించకపోతే మీరు నమోదు చేసిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ సరిగా ఉందో లేదో చెక్ చేయండి. అధికారిక పోర్టల్‌లో మళ్లీ ప్రయత్నించండి. కొన్ని సందర్భాల్లో స్టేటస్ అప్‌ డేట్ కావడానికి 24 గంటల నుంచి 72 గంటల సమయం పట్టవచ్చు. కాబట్టి, కొత్త సమయం తర్వాత మళ్లీ చెక్ చేయండి. ఇది కూడా మీకు సరైన ఫలితాలు ఇవ్వకపోతే మీ BLO లేదా లోకల్ ఎలక్షన్ నమోదు కార్యాలయాన్ని సంప్రదించండి.

Also Read: Sony Bravia 2 అండ్ Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

ఈ ఫామ్ చెక్ చేయడం వలన ఏమిటి ప్రయోజనం?

మీ మీ ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ చెయ్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ ప్రస్తుత స్థితి తెలుసుకోవచ్చు. అలాగే, మీ ఫామ్ ధృవీకరణ పూర్తయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. మీ ఫామ్ లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే మీరు సరిదిద్దుకోవచ్చు.

మీ ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ ను ఆన్‌లైన్‌లో చెక్ చేయడం చాలా సులభం. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ లేదా సంబంధిత వివరాలు ఉంటే కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ దరఖాస్తు ఏ దశలో ఉందో మీరు తెలుసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :