Moto G (3rd Gen) పై క్విక్ అభిప్రాయం

Moto G (3rd Gen) పై క్విక్ అభిప్రాయం
HIGHLIGHTS

మోటో G 3rd gen ఫస్ట్ ఇంప్రెషన్స్: డిసెంట్ గా ఉంది. కాని ప్రస్తుత హెవి పోటీ మొబైల్ మార్కెట్ లో కరెక్ట్ కాదు

మోటో G3 డిజైన్ పరంగా consumers మాటలను విని మార్చి ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. మరి స్పెసిఫికేషన్స్ పరంగా కూడా నిజంగా మోటోరోలా మోటో G 3rd gen మోడల్ పై శ్రద్ధ చూపించిందా లేదా చూద్దాం రండి. డిజిట్ టెస్ట్ ల్యాబ్స్ లో మోటో G3 పై మేము తెలుసుకున్న విషయాలను ఇక్కడ చూడగలరు..

బడ్జెట్ మొబైల్ మోడల్స్ దూసుకుపోతున్న సమయంలో మోటో పై ఇంకా expectations ఉండటానికి కారణం xiaomi, lenovo వంటి వాటి కన్నా బెటర్ బ్రాండ్ నేమ్ ఉంది మోటోరోలా కు.

11,999 ధరకు 1gb ర్యామ్ ఇవ్వటం మాత్రం మిగతా మొబైల్స్ తో పోలిస్తే నిరాశ పరిచింది అని చెప్పవచ్చు. అయితే 1000 రూ అధిక అమౌంట్ తో 2gb ర్యామ్ వేరియంట్ కూడా మార్కెట్ లో లాంచ్ చేయటం కొంచెం ఊరట లభించింది మోటో ఫ్యాన్స్ కు. 

స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్ మైనర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాలి. గతంలోని మోడల్స్ లో 400 స్నాప్ డ్రాగన్ ఉండేది. Competitors మాత్రం స్నాప్ డ్రాగన్ 615 పై దింపారు మోడల్స్. మోటో G3 ఫస్ట్ ఇంప్రెషన్స్ లో అన్ని స్నాప్ డ్రాగన్ 410 మోడల్స్ వలె పెర్ఫారం చేసింది.

మోటోరోలా లోని స్టాక్ యూజర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ గురించి అందరికీ తెలిసినదే. సింపుల్ అండ్ యూజ్ఫుల్. దీనికి అప్ డేట్స్ కూడా త్వరగా వస్తాయి. ui వాడటానికి మాత్రం చాలా స్మూత్ గా ఫాస్ట్ గా ఉంది. ఎటువంటి bloatware యాప్స్ లేవు.

దీని గురించి ఏమైనా చెప్పుకోవాలంటే IPX7 వాటర్ రెసిస్టన్స్ గురించి చెప్పాలి. ఇది 30 నిముషాలు పాటు 3 అడుగుల లోతు వాటర్ లో ఉండగలదు. అంతకు మించి ట్రై చేయకండి. పనిచేయదు. వాటర్ resistant అంటే ఎలాంటి వాటర్ పరిస్తితులలోనైనా పనిచేస్తుంది అని కాదు. దానికి కొన్ని limitations ఉంటాయి. వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది వాటర్ resistant అని హెవీ వాటర్ యూసేజ్ చేసి, సర్వీస్ సెంటర్లకు వెళ్లిన తరువాత దాని limitations గురించి తెలుసుకొని బాధపడతారు.

155 గ్రా బరువు తో మోటో G2 కన్నా కొంచెం ఎక్కువ బరువు మరియు thickness తో వస్తుంది మోటో G3. దీని మందం 11.6mm. కాని లైవ్ యూసేజ్ లో మాత్రం మీకు ఆ డిఫరెన్స్ తెలియటం కష్టం. సో నో ప్రాబ్లెం.

ఓవర్ ఆల్ గా మోటో G 3rd gen ఫోన్ ప్రీమియం satisfaction ఇవ్వటంలేదు కాని ఉండవలసినవి ఉన్నాయి. స్పెక్స్ పరంగా అద్భుతమైన ఫీలింగ్ క్రియేట్ చేయలేదు కాని atleast లుక్స్ పరంగా కొంచెం satisfy చేసింది అనుకోవాలి. ఫోన్ వెనుక ఉన్న ప్లాస్టిక్ rubberised బ్యాక్ మంచి గ్రిప్ మరియు ఫీల్ ను ఇస్తుంది. కాని దీని competitors మాత్రం మరింత ప్రీమియం లుక్స్ ఇస్తున్నాయి. ఇది తీసుకోవటానికి ఉన్న రెండు కారణాలు… ఒకటి బ్రాండ్ వాల్యూ మరొకటి ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్. అయితే మీరు కరెంట్ ట్రెండ్ యూజర్స్ లా ఆఫ్టర్ సేల్స్ మరియు బ్రాండింగ్ నేమ్ పెద్దగా పట్టించుకోని వారు అయితే ఈ ఫోన్ మిమ్మల్ని ఆకర్షించదు. అలాంటి వారికి ఇది recommended ఫోన్ కాదు మోటో G 3rd Gen మోడల్. దీనిపై త్వరలోనే రివ్యూ ను అందిస్తాము.

Buy Moto G (3rd Generation) on Flipkart at Rs. 12,999

Prasid Banerjee

Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo