మీ ఫోన్ లో ప్రతి Photo క్రిస్టల్ క్లియర్‌ గా రావాలా.. మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్స్ ఇవే.!

HIGHLIGHTS

మంచి కెమెరా ఉంటేనే అద్భుతమైన ఫోటోలు వస్తాయని అనుకుంటారు

వాస్తవానికి ఫోటో నాణ్యతను నిర్ణయించేది కేవలం కెమెరా మాత్రమే కాదు

ప్రతి Photo క్రిస్టల్ క్లియర్‌ గా చిత్రించడానికి మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్స్

మంచి కెమెరా ఉంటేనే అద్భుతమైన ఫోటోలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఫోటో నాణ్యతను నిర్ణయించేది కేవలం కెమెరా మాత్రమే కాదు. సరైన టెక్నిక్, లైటింగ్, ఫోకస్, కెమెరా సెట్టింగ్స్, అలాగే ఫోటోగ్రాఫర్ తీసుకునే జాగ్రత్తలు కూడా గొప్ప ఫోటోలు పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్ ఉన్నా కోడోత్ కొన్ని ఫోటోలు బ్లర్‌ గా రావడానికి మరియు సాధారణ ఫోన్‌ తో కూడా అద్భుతమైన షార్ప్ ఫోటోలు రావడానికి ఇదే కారణం. అందుకే, మీ ఫోన్ లో ప్రతి Photo క్రిస్టల్ క్లియర్‌ గా చిత్రించడానికి మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్స్ ఈరోజు అందించాము.

లెన్స్ శుభ్రంగా ఉందో లేదో చూసుకోండి

ఫోన్ లో ఉన్న కెమెరాకి పని చెప్పే ముందు ఫోన్ కెమెరా పైన మరకలు తొలగించండి. స్మార్ట్‌ ఫోన్ రోజంతా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి కెమెరా లెన్స్‌ పై సాదరణంగా వేలిముద్రలు లేదా దుమ్ము లేదా ఆయిల్ పేరుకుపోతాయి. ఇవి ఫోటోలు మసకబారేలా చేస్తాయి. అందుకే, ఫోటో తీసే ముందు మృదువైన మైక్రోఫైబర్ గుడ్డతో ఫోన్ లెన్స్‌ ను శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న పని ఫోటో నాణ్యతలో పెద్ద మార్పును తీసుకొస్తుంది.

ఫోకస్‌ ను ఎప్పుడూ మాన్యువల్‌ గా నిర్ధారించండి

చాలా మంది కెమెరా యాప్ తెరిచిన వెంటనే ఫోటో తీస్తారు. కానీ ఇలా చేస్తే కెమెరా సరైన ప్రాంతం పై ఫోకస్ చేసే అవకాశం ఉండదు. అందుకే, ఫోటో తీయడానికి ముందు ఎవరినైతే మీరు స్క్రీన్‌ పై స్పష్టంగా కనిపించాలని కోరుకుంటారో ఆ వ్యక్తి లేదా వస్తువు పై ట్యాప్ చేసి ఫోకస్ లాక్ చేయండి. ఇలా చేయడం వలన ముఖ్యమైన భాగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఫోటో చాలా క్లియర్ అండ్ ఫోకస్ గా ఉంటుంది.

కెమెరాను స్థిరంగా ఉంచండి

చిన్న కదలిక కూడా ఫోటో బ్లర్ కావడానికి కారణమవుతుంది. రెండు చేతులతో ఫోన్‌ ను బలంగా లేదా స్థిరంగా పట్టుకోవడం లేదా గోడకు ఆనించి నిలబడటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి సమయంలో లేదా తక్కువ కాంతిలో ఫోటోలు తీసేటప్పుడు ట్రైపాడ్ ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. లేదంటే ఫోటోలు బ్లర్ గా ఉండే అవకాశం ఉంటుంది.

సహజ కాంతిని ఉపయోగించండి

ఫోటోగ్రఫీలో లైటింగ్ అత్యంత ముఖ్యమైన అంశం అని కచ్చితంగా చెప్పవచ్చు. ఉదయం లేదా సాయంత్రం లభించే మృదువైన సహజ కాంతి లో తీసిన ఫోటోలు మరింత సహజంగా మరియు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండలో తీసిన ఫోటోలలో నీడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంటి లోపల ఫోటోలు తీసేటప్పుడు కిటికీ దగ్గర నిలబడటం మంచి ఫలితాలను ఇస్తుంది.

డిజిటల్ జూమ్‌ కు బదులుగా దగ్గరకు వెళ్లండి

డిజిటల్ జూమ్ ఉపయోగిస్తే ఫోటోలోని వివరాలు తగ్గిపోతాయి. వీలైతే ఫోటో తీసే వస్తువు లేదా మనిషికి దగ్గరగా వెళ్లి ఫోటో తీయండి. మీ ఫోన్‌ లో ఆప్టికల్ జూమ్ ఉంటే దానిని ఉపయోగించడం ఉత్తమం. అయితే, పూర్తి స్థాయి జూమ్ కాకుండా 50% జూమ్ తో తీసే ఫోటోలు చాలా వివరాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతారు.

HDR మరియు నైట్ మోడ్‌ను సరైగ్గా ఉపయోగించండి

వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రాంతం మరియు చీకటి ప్రాంతం ఒకే ఫ్రేమ్‌ లో ఉన్నప్పుడు HDR మోడ్ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి సమయంలో లేదా తక్కువ వెలుతురులో నైట్ మోడ్‌ ను ఉపయోగిస్తే కెమెరా ఎక్కువ కాంతిలో కూడా స్పష్టమైన ఫోటోలు అందిస్తుంది. అయితే, ఫోటో ప్రాసెస్ అయ్యే వరకు ఫోన్‌ ను కదిలించకుండా స్థిరంగా పట్టుకోవడం చాలా ముఖ్యం.

అత్యధిక రిజల్యూషన్‌ లో Photo లు తీయండి

చాలా స్మార్ట్‌ ఫోన్‌ లలో 50MP లేదా 108MP కెమెరా ఉన్నప్పటికీ డిఫాల్ట్‌ గా తక్కువ రిజల్యూషన్‌ లోనే ఫోటోలు సేవ్ అవుతుంటాయి. కానీ, ప్రత్యేక సందర్భాల్లో అధిక రిజల్యూషన్ మోడ్‌ ను ఉపయోగిస్తే తర్వాత క్రాప్ చేసినా ఫోటో నాణ్యత తగ్గదు. అందుకే, అత్యధిక రిజల్యూషన్‌ లో ఫోటోలు తీయడం మంచిది.

కెమెరా సెన్సార్ పరిమితులను గుర్తుంచుకోండి

ఖరీదైన DSLR లేదా మిర్రర్‌ లెస్ కెమెరాల మాదిరిగా ప్రతి స్మార్ట్‌ ఫోన్ పనిచేయదు. ఎక్కువ చీకటిలో లేదా వేగంగా కదులుతున్న వస్తువులు ఫోటో తీసేటప్పుడు కొంత బ్లర్ రావడం సహజం. అందుకే పరిస్థితికి అనుగుణంగా సరైన మోడ్‌ ను ఎంచుకోవాలి.

Also Read: అండర్ రూ. 25,000 బెస్ట్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

AI ఫీచర్లను తెలివిగా ఉపయోగించండి

ప్రస్తుతం చాలా స్మార్ట్‌ ఫోన్‌ లలో AI Camera, Scene Recognition, AI Enhancement వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కలర్స్, కాంట్రాస్ట్ మరియు డైనమిక్ రేంజ్‌ను మెరుగుపరుస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో AI ఫోటోలు సహజంగా కాకుండా ఎక్కువ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, అవసరాన్ని బట్టి AI ని ఆన్ లేదా ఆఫ్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోటోలు సహజంగా కనిపించే అవకాశం ఉంటుంది.

ప్రాక్టీస్‌ కు ప్రత్యామ్నాయం లేదు

అత్యుత్తమ ఫోటోగ్రాఫర్లు కూడా వేలాది ఫోటోలు తీసిన తర్వాతే మంచి అనుభవాన్ని సంపాదించారు. ఒకే సబ్జెక్ట్‌ ను వేర్వేరు కోణాల్లో, వేర్వేరు లైటింగ్ పరిస్థితుల్లో చిత్రీకరించడం ద్వారా ఏ సెట్టింగ్‌ లో మంచి ఫలితం వస్తుందో అర్థమవుతుంది. అందుకే, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గొప్ప ఫోటోలు పొందుతారు.

షార్ప్ ఫోటోలు రావాలంటే ఖరీదైన కెమెరా ఒక్కటే పరిష్కారం కాదని మీరు గమనించాలి. సరైన ఫోకస్, పరిశుభ్రమైన లెన్స్, మంచి లైటింగ్, స్థిరమైన చేతులు, సరైన కెమెరా సెట్టింగులు మరియు తగిన షూటింగ్ విధానం కలిస్తే ఏ స్మార్ట్‌ ఫోనుతో అయినా అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :