How to Select the Right Air Conditioner Based on Room Size explained in telugu
వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్ (AC) కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ప్రస్తుతం సీజన్ తో లేకుండా చాలా మంది తక్కువ ధర లేదా ఆఫర్ చూసి AC కొనేస్తారు. అదీకాకుండా ఇప్పుడు కాలంతో పనిలేకుండా ఎండలు విపరీత ధోరణి అనుకరించడం వలన సంవత్సరం మొత్తం వేడిగానే ఉంటోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న El Nino ఎఫెక్ట్ కూడా వేడి పెరగడానికి కారణంగా చూడొచ్చు. అయితే, గది పరిమాణానికి సరిపోని AC ని ఎంపిక చేస్తే చల్లదనం సరిగా ఉండదు. అంతేకాకుండా విద్యుత్ బిల్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, గది పరిమాణానికి సరిగ్గా సరిపోయే AC ఎలా ఎంచుకోవాలి మరియు దీనికోసం తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు చూద్దాం.
AC కొనుగోలు చేసే ముందు గది విస్తీర్ణం, కెపాసిటీ, స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ మరియు వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఈరోజు ఈ విషయాలు అన్ని వివరంగా చర్చిద్దాం.
ఏసీ అనగానే ముందుగా అందరూ ఎక్కువగా ఆలోచించే విషయం టన్నేజ్. చాలా మంది 1 టన్, 1.5 టన్, 2 టన్ అంటే ఏసీ అంటే బరువు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు, Ton అనేది AC యొక్క కూలింగ్ కెపాసిటీ సూచించే ప్రమాణం. టన్నేజ్ ఎక్కువగా ఉంటే అది పెద్ద గదిని కూడా త్వరగా చల్లబరచగలదు.
నిజానికి గది పరిమాణం బట్టి ఏసీ ఎంచుకోవడం సరైన పద్దతి అవుతుంది. ఎందుకంటే, ఈ యాక్షన్ ప్లాన్ తో ఏసీ కొనేప్పుడు మరియు కొన్న తర్వాత కరెంట్ బిల్స్ లో కూడా డబ్బు ఆదా చేయవచ్చు.
ఈ లిస్ట్ లో చిన్న బెడ్‌రూమ్, స్టడీ రూమ్ మరియు చిన్న ఆఫీస్ రూమ్ వంటివి వస్తాయి. ఇలాంటి రూమ్స్ కోసం 0.8 Ton లేదా 1 Ton AC చక్కగా సరిపోతుంది. ఈ పరిమాణం ఉన్న గదికి 1 టన్ AC సరిపోతుంది. గది ఎక్కువ ఎండకు గురికాకపోతే 0.8 టన్ మోడల్ కూడా సరిపోవచ్చు.
ఇది మనం ఇళ్లలో ఉండే సాధారణ భారతీయ బెడ్ రూమ్ పరిమాణంగా లెక్కిస్తారు. ఇలాంటి బెడ్ రూమ్స్ కోసం 1 Ton నుంచి 1.2 Ton ఏసీ తగిన ఎంపిక అవుతుంది. గది పై అంతస్తులో ఉంటే లేదా గడిపై నేరుగా ఎండ నేరుగా పడితే 1.2 టన్ ఏసీ ఉత్తమ ఎంపిక అవుతుంది.
ఈ సైజులో మాస్టర్ బెడ్‌రూమ్ లేదా చిన్న హాల్ లను లెక్కిస్తారు. అటువంటి గది కోసం 1.5 Ton ఏసీ చాలా చక్కగా సరిపోతుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఏసీ కెపాసిటీ కూడా ఇదే అవుతుంది. ఇది చల్లదనం మరియు విద్యుత్ వినియోగం మధ్య మంచి సమతుల్యతను అందిస్తుంది.
ఈ లిస్ట్ లో పెద్ద హాల్, లివింగ్ రూమ్ మరియు ఆఫీస్ క్యాబిన్ వంటివి వస్తాయి. వీటికోసం 2 Ton ఏసీ ని సిఫార్స్ చేస్తారు. ఈ పరిమాణం ఉన్న గదిలో 1.5 టన్ AC ఉపయోగిస్తే గది పూర్తిగా చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనితో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, పెద్ద గదికి తక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ వాడకూడదు.
కేవలం గది పరిమాణం కాకుండా ఇన్వర్టర్ AC లేదా నాన్ ఇన్వర్టర్ AC కూడా ఏసీ బిల్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Also Read: 5.1 Dolby Soundbar Deals: కేవలం 6 వేల లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!
ప్రతి రోజూ AC ఉపయోగించే వారికి ఇన్వర్టర్ ఏసీ ఉత్తమ ఎంపికగా ఉంటుంది.
ఇలా ముందుగా ఏసీ పై మంచి ప్రణాళిక చేసుకుంటే మీరు మీ బడ్జెట్ ధరలో మీ బెడ్ రూమ్ లేదా ఇంటికి తగిన ఏసీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.