మీకు తెలియని మంచి రేసింగ్ గేమ్ [ఏప్రిల్ 6]

మీకు తెలియని మంచి రేసింగ్ గేమ్ [ఏప్రిల్ 6]

రేసింగ్ గేమింగ్ అంటే ఇష్టపడని age గ్రూప్ ఉండదు. కాని age పెరిగే కొద్దీ ఎక్కువ శాతం మంది తక్కువ గ్రాఫిక్స్ తో సింపుల్ గా ఉండే రేసింగ్ గేమ్స్ పైనే ఇంటరెస్ట్ ను మార్చుకుంటారు.

ఇప్పుడు మీరు అలాంటి గేమ్ నే చూడబోతున్నారు. పేరు Racing In Car. ప్లే స్టోర్ లో ఇది దాదాపు 50MB సైజ్ కలిగి ఉంది. కాని 4.4 స్టార్ రేటింగ్ తో 10 మిలియన్ users దీనిని ఇంస్టాల్ చేసుకోవటం జరిగింది.

గేమ్ సింపుల్ గా ఉంటుంది. జస్ట్ కార్ మరియు ట్రాక్ ను ఎంచుకొని రేసింగ్ స్టార్ట్ చేయటమే. ప్లే స్టోర్ లో ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే..

గేమ్ కూల్ గా వెళ్తుంది..మధ్యలో ఆపేయాలని అనిపించదు. అలాగే భారిగా హడావిడి చేసే గ్రాఫిక్స్, అడ్డంకులు మరియు గోల్స్ ఏమి ఉండవు. స్క్రీన్ view లో మీరు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న view ఉంటుంది.

వ్యూ మార్చుకోవటానికి అవదు, అలాగే గేరింగ్ అదీ ఆటోమాటిక్ గా ఉంటుంది. స్క్రీన్ కు రెండు వైపులా రెండు కంట్రోల్ బటన్స్. అంతే వీటిని మార్చుకోవటానికి అవ్వదు.

PJ Hari

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile