ఎల్లప్పుడూ ఫోన్ టోటల్ ఆఫ్ అవకుండా స్క్రీన్ పై టైం, నోటిఫికేషన్స్, డేట్ చూపించే యాప్

ఎల్లప్పుడూ ఫోన్ టోటల్ ఆఫ్ అవకుండా స్క్రీన్ పై టైం, నోటిఫికేషన్స్, డేట్ చూపించే యాప్

మీ ఫోన్ స్క్రీన్ పై ఎల్లప్పుడూ టైం, డేట్ మరియు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా లేదా, వస్తే ఏమి వచ్చాయి అని మీకు ఫోన్ స్క్రీన్ ఆన్ చేయనవసరం లేకుండా తెలియజేస్తూ ఉండటానికి Always on AMOLED అనే యాప్ పనిచేస్తుంది.

స్క్రీన్ ఆన్ ఆన్ అయ్యి ఉండటం అంటే స్క్రీన్ అంతా బ్లాక్ కలర్ లో ఉంటూ, పైన చెప్పిన వాటిని మాత్రం వైట్ కలర్ లో చూపిస్తుంది. పాకెట్ లో పెట్టుకుంటే స్క్రీన్ టోటల్ గా ఆఫ్ అయిపోయేలా సెట్ చేసుకోగలరు కూడా.

ఇది proximity సెన్సార్ ద్వారా వీలు పడుతుంది. అంటే సెన్సార్ పై ఏదైనా ఉంటే ఆఫ్ అయిపోతుంది. మీరు చేయి పెట్టినా, అలా పాకెట్ లోకి ఫోన్ పెట్టిన వెంటనే టోటల్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది మరలా పాకెట్ నుండి తీయగానే ఆన్ అవుతుంది.

ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాప్ లో. అయితే ఇది amoled డిస్ప్లే లకు అయితే బ్యాటరీ హరించటం అనేది ఉండదు. నార్మల్ డిస్ప్లే లపై ఎప్పుడూ స్క్రీన్ ఆన్ లో ఉంచటం అంటే కొంత బ్యాటరీ అవుతుంది.

యాప్ లింక్ – 4.2 స్టార్ రేటింగ్ ఉంది. బేసిక్ గా యాప్ వాడటానికి rooting తో పనిలేదు కాని కొన్ని advanced ఫీచర్స్ కొరకు రూటింగ్ అవసరం ఉంటుంది. ఇది బేసిక్ గా మొదట్లో సామ్సంగ్ ఫ్లాగ్ షిప్ ఫోనులకు వచ్చిన ప్రత్యేకమైన ఫీచర్.

Samsung Galaxy J7 SM-J700F అమెజాన్ లో 11,900 Rs లకు కొనండి

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo