Samsung Galaxy F70 Pro 5G india launch announced
Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది శాంసంగ్. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ కెమెరా మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు వెల్లడించే హింట్ ఇమేజ్ కూడా రిలీజ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా రిలీజ్ చేసింది.
Also Read : PHILIPS Dolby Soundbar పై జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ టీజర్ లో ఈ ఫోన్ కెమెరా సెటాప్ ఇమేజ్ ని అందించింది. ఈ ఇమేజ్ లో ఈ ఫోన్ నిలువుగా ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నట్లు క్లియర్ అయ్యింది. ఇందులో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో సెన్సార్ లు ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.