చౌక ధరలో 64MP+8MP+2MP+2MP కెమేరాతో వచ్చిన REDMI NOTE 8 PRO

HIGHLIGHTS

గేమింగ్ కోసం ప్రత్యేకమైన మీడియా టెక్ హీలియో G90T చిప్ సెట్ తో వచ్చింది.

చౌక ధరలో 64MP+8MP+2MP+2MP కెమేరాతో వచ్చిన REDMI NOTE 8 PRO

షావోమి, ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి REDMI NOTE 8 PRO న్ను గొప్ప స్పెక్స్ తో చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేనుక ఒక 64MP ప్రధాన కేమెరా గల క్వాడ్ కెమెరాతో మరియు గేమింగ్ కోసం ప్రత్యేకమైన మీడియా టెక్ హీలియో G90T చిప్ సెట్ తో వచ్చింది. ఆయితే,ఈ ఫోన్ను మాత్రం కేవలం రూ.14,999 రూపాయల ప్రారంభదరతో ధరతో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఇంకా మరెన్నో విశేషాలతో విడుదలయ్యింది.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 8 ప్రో  : ధరలు 

1. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +64GB ) – Rs.14,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +128GB ) – Rs.15,999/-

3. రెడ్మి నోట్ 8 ప్రో (8GB +128GB ) – Rs.17,999/

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.  

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.      

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile