REDMI NOTE 8 PRO మరికొద్ది సేపట్లో విడుదలకానుంది : LIVE చూడడం ఎలా

HIGHLIGHTS

ఈ భారతీయ లాంచ్ గురించి ట్విట్టర్‌లో ప్రకటించింది

REDMI NOTE 8 PRO మరికొద్ది సేపట్లో విడుదలకానుంది :  LIVE చూడడం ఎలా

ముందుగా ఆగస్టులో, కంపెనీ రెడ్మి నోట్ 8 ప్రో  స్మార్ట్ ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది, ఇప్పుడు ఈ ఫోన్ భారతదేశంలో ప్రవేశించబోతోంది. చైనాలో ప్రారంభించిన తరువాత, టెస్ట్ మరియు ధృవీకరణ ప్రక్రియ కోసం రెండు నెలల సమయం తరువాత, ఈ రెడ్మి నోట్ 8 ప్రోను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ చెప్పారు. ఇటీవల, షావోమి ఈ ఫోన్‌కు సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది. # 64MPQuadCamBeast తో ఒక పోస్ట్ పెట్టడం ద్వారా కంపెనీ లాంచ్ వివరాలను ప్రకటించింది. రెడ్మి ఇండియా ఈ భారతీయ లాంచ్ గురించి ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో రానుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లాంచ్ ఈవెంట్ ఇక్కడ నుండి LIVE చూడవచ్చు. 

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు (చైనా వేరియంట్)

ఇది కాకుండా, రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ గురించి చూస్తే, ఇది ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది 3D  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే తో వస్తుంది. మీరు దీన్ని కొత్త జాడే గ్రీన్ కలర్‌లో అందుకోనున్నారు. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకముగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ ఫోన్నుఅందుకోనున్నారు .

రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్‌లో, గరిష్టంగా ఒక  64 MP కెమెరాను అందుకోనున్నారు, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile