REDMI NOTE 8 కేవలం రూ.9,999 ధరలో 48MP కలిగిన 4 కెమెరాలతో విడుదల
ఈ ఫోన్ ఇంకా మరెన్నో విశేషాలతో విడుదలయ్యింది.
షావోమి, ఈ రోజు ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటిREDMI NOTE 8 ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేనుక ఒక 48MP ప్రధాన కేమెరా గల క్వాడ్ కెమెరాతో మరియు సరికొత్తగా వచ్చినటువంటి క్వల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ తో వచ్చింది. ఆయితే, ఈ ఫోన్ను మాత్రం కేవలం రూ.9,999 ధరలో బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఇంకా మరెన్నో విశేషాలతో విడుదలయ్యింది.
Surveyరెడ్మి నోట్ 8 : ధరలు
1. రెడ్మి నోట్ 8 (4GB +64GB ) – Rs.9,999/-
2. రెడ్మి నోట్ 8 (6B +128GB ) – Rs.12,999/-
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ అక్టోబరు 21 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.
రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు
రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.
ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక 48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile