కేవలం రూ. 8,999 ధరలో పంచ్ హోల్ సెల్ఫీ మరియు క్వాడ్ కెమేరా స్మార్ట్ ఫోన్ : Infinix S5

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్ Flipkart నుండి అక్టోబరు 21 మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది.

కేవలం రూ. 8,999 ధరలో పంచ్ హోల్ సెల్ఫీ మరియు క్వాడ్ కెమేరా స్మార్ట్ ఫోన్ : Infinix S5

ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇన్ఫినిక్స్ సంస్థ ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ చాల చౌకధరలో ఒక 32MP పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా,వెనుక  క్వాడ్ రియర్ కెమెరా సెటప్,  4000mAh బ్యాటరీ వంటి గొప్ప స్పెక్స్ తో, భారతదేశంలో కేవలం రూ.8,999 ధరతో  Infinix S5 పేరుతొ ఈ రోజు ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది.  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్ Flipkart నుండి అక్టోబరు 21 మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix S5 ప్రత్యేకతలు

ఈ Infinix S5 స్మార్ట్ ఫోన్  ఒక 6.6 అంగుళాల HD+ IPS పంచ్ హోల్ డిజైనుతో మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది మరియు .ఇది 480 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంతేకాదు , ఇది ఒక 20:9 ఆస్పెక్ట్ రేషియోని కలిగిన పెద్ద స్క్ర్రీనుతో వస్తుంది.  ఇక ఇందులో చాలా గొప్ప 3D యూనిబాడి డిజనుని కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.5 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.అధనంగా 256GB స్టోరేజిని ఒక మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు మరియు డ్యూయల్ VoLTE కి అపార్ట్ చేస్తుంది.

ఈ  Infinix S5 కెమేరాల గురించి  మాట్లాడితే,  వెనుకభాగంలో  ఒక ప్రధాన 16 మెగాపిక్సెల్ (f1.8) కెమేరాకి జతగా ఒక 5MP వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటుగా మరొక 2MP డెప్త్ సెన్సార్ మరియు ఒక మ్యాక్రో లెన్స్ తో జతగా కలిపిన ఒక  క్వాడ్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 32-MP AI కెమెరాని  కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

అధనపు ఫీచర్ల విషయానికి వస్తే, డివైజ్ కనెక్టివిటీ, 3.5mm ఆడియో జాక్, FM , OTG, ట్రిపుల్ సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచరుతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుక్వజల్ షాన్ మరియు కాస్మిక్ పర్పల్ వంటి కలర్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo